ఎప్రిల్ మాస రాశి ఫలితాలు

మేష రాశి:
కుటుంబ సౌఖ్యం బాగుంటుంది,అయితే ఆరొగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి.స్థానచలనమునకు సంబంధించి అవకాశాలు ఉన్నాయి.మాటని అదుపులో పెట్టుకొవాల్సిన సమయం.మానసిక ప్రశాంతత లోపించే అవకాశం.నూతన ప్రయత్నాలకు అనుకూలం. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభ రాశి:
ప్రథమార్థం అనూకులంగా ఉంటుంది.ద్వితీయార్థం చిన్న ఇబ్బందులున్నను తెలివిలో అధిగమిస్తారు.మధ్యవర్తిత్వం పనికి రాదు.శుభ కార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు.దూర ప్రాంతాల ప్రయాణం మంచిది కాదు.లక్ష్మి నరసింహ స్వామి ఆరాధన శ్రేయస్కరం.

మిథున రాశి:
అన్ని విషాయాలలో జాగ్రత్త అవసరం.సమస్యలు తరచుగ వచ్చె అవకాశాలు.కొన్ని వ్యవహారాలు మాత్రమే అనుకూలం.అలంకరణ వస్తువులకు ఖర్చు. వాహనాలు నడిపెటపుడు శ్రద్ధ జాగ్రత్త అత్యవసరం.నవగ్రహ శ్లోక పఠనం శ్రేయోదాయకం.

కర్కాటక రాశి:
ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం.కుటుంబ సమస్యలకు పరిష్కారం వెతుక్కొనె పరిస్థితి.నూతన ప్రయత్నాలు సానుకులంగా సాగవు.ఉద్యాగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ. అధైర్య పడకుండా జాగ్రత్తగా అవసరం. ఆంజనేయ స్వామి ఆరాధన శ్రేయస్కరం.

సింహ రాశి:
అన్నీ అనుకూలంగ ఉన్నట్ట్లు అనిపిస్తుంది.కాని తరచుగా కలహాములు ఋణములు ఇబ్బంది పెడతాయి.కుటుంబ సమస్యలు.ఎండలో జాగ్రత్త అవసరం.సంఘంలొ అగౌరవం.కొన్ని విషయాలాలో మౌనంగా ఉండడం అవసరం.దక్షిణ మూర్తి ఆరాధన శ్రేయస్కరం.

కన్య రాశి:
ఆర్ధిక,ఆరొగ్య,కుటుంబ విషయాలలో జాగ్రత్తతో సమస్యలను అధిగమిచడంలో విజయవంతులవుతారు.ఉద్యోగ వ్యాపారాలు శ్రమతో కూడుకున్నది.సంఘంలో గౌరవ మర్యాదలకు అవకాశం బాగా ఉంటుంది.నరసింహా స్వామి ఆరాధన శ్రెయస్కరం.

తులా రాశి:
ఆచితూచి వ్యవహరించడం, సమయానుసారం ప్రతి పని చేయటం, ఆర్ధిక కార్యాలల్లో మీ ప్రతిభ వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు.కాని లాభాలు ఆలస్యమవుతాయి.శ్రమ అధిక ధన వ్యయం అయ్యే అవకాశం.ఆరొగ్యం ఇబ్బందిలో పడే అవకాశం.దత్తాత్రేయ ఆరాధన మంచిది.

వృశ్చిక రాశి:
ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకొవాల్సిన సమయం.మధ్యవర్తిత్వం చేయవద్దు.తరచూ ప్రయణాలు.అకాల భోజనం.ద్వితీయార్థం అనుకూలం. సుబ్రమణ్య ఆరాధన మంచిది.

ధనస్సు రాశి:
ప్రతి అంశం లోనూ ఆలస్యమయ్యే అవకాశం.అధిక ధనవ్యయం.శుభకార్యాల నిమిత్తం ప్రయణాలు.ఉద్యోగం ఆలస్యం.ఉద్యోగం లో ఉన్నవారికి వొత్తిడి.వ్యాపారంలో కార్యాలస్యం.ఎన్నో అంశాలలో మీకూ నష్టాన్ని సూచిస్తున్నప్పటికి నిరుత్సాహ పడకుండా ప్రతి పనిని వెంబడిస్తారు.సన్నిహితుల సహకారం కష్టం. లలితా పారాయణ మంచిది.

మకర రాశి:
మిశ్రమ ఫలితాలు.ఆగ్రహావేశాలు పెరుగుతాయి.ప్రతి పనిలో చికాకు కలిగే అవకాశం.కుటుంబ అననూకూలత.ఉద్యొగంలో అనుకూలత.ఈ నెలలో మీరు ఒర్పూ వహిస్తే అన్ని సానుకూలమే. ఉద్యొగంలో కాని వ్యాపరం లో కాని ప్రతి పని స్వయంగా చేసుకుంటే మంచిది. సుందరకాండ పారయణం రామనవమి రోజు చేస్తే మంచిది.

కుంభ రాశి:
చాలా జాగ్రత్త పాటించవలసిన సమయం.ముఖ్యంగా ఆరొగ్యము మరియు ఋణ సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం.ఎవ్వరికి మాట ఇవ్వదం మధ్య వర్తిత్వం చేయడంలాంటి వాటితో జాగ్రత్త.కుటుంబ విషయమూలో అనుకూలం.ప్రతి రోజు శ్రీ మాత్రే నమ: ధ్యానం చేయండం మంచిది.

మీన రాశి:
దినచర్యలో ఎటువంటి మార్పూ లేదు.కొత్త ప్రయత్నాలు ఫలించవు.మీ విషయాలు రహస్యంగా వుంచడం మంచిది.విద్యర్థులకు వడ్డి వ్యాపారులకు మంచి కార్యలాభం.కుటుంబ విషయాలలో అనుకూలం.అన్ని విషయాలలో విజయం. విష్ణు సహాస్రనామం పఠనం మంచిది.

Anudeep Sharma MA Astrology (PSTU)

Anudeep Sharma Kappakanti
MA Astrology (Graduate from PSTU)

Mobile: 9848272621

Consult for:
Online Astrology – Vaastu – Birth stones
Performing all kind of Poojas, Abhishekas, Homas, Marriage and Gruhapravesh
Match making – Dosha nivarana Poojas (95% results)

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.