Why this Gobbemma on Sankranthi

సూర్యుడు గుర్రాల రథం వేసుకొని రాశిలో నుండి మరొక రాశిలోకి వెళ్తాడా…. అని అడిగే మేధావుల కోసం…ప్రతిఒక్కరు తప్పక తెలుసుకోండి

సూర్యుడిలో ఉండే మచ్చల వలన రేడియేషన్ విడుదల అవుతుంది అని మనకు తెలుసు కదా కానీ సూర్యుడు ప్లాస్మా కావడం వలన సూర్యుడి ఆత్మభ్రమణంలో అన్ని అక్షాంశాలు ఒకే వేగంతో తిరగవు. 0° అక్షాంశం వేగంగాను 90° అక్షాంశం నెమ్మదిగాను తిరుగుతాయు అందువల్ల సూర్యుడిలో మచ్చలు వివిద సందర్భాల్లో వివిధ రకాలుగా ఉండి వేరు వేరు రకాలుగా రేడియేషన్, వేడి వెలుతురు విడుదల చేస్తాయి.

సూర్యుడి భ్రమణ వేగం లెక్కించడంఈ ద్వారా భూమిపై ఏ రోజు ఎటువంటి రేడియేషన్ ఉంటుంది అందువల్ల కలిగే పరిణామాలు తెలియచేయడానికి నక్షత్రాలు రాశులు ఏర్పాటు చేశారు సనాతన భారతీయ ఋషులు.

0° అక్షాంశం 360° పూర్తి చేయడానికి సుమారుగా 26.79 రోజులు పడుతుంది అదే సమయానికి 45° అక్షాంశం సుమారుగా 332.31° మాత్రమే పూర్తి అవుతుంది. అందువల్ల 0° అక్షాంశాన్ని సౌరవ్యవస్థకు దగ్గరలో ఉన్న 27 నక్షత్రాల ఆధారంగా 27భాగాలు చేశారు అవే 27 నక్షత్రాలు 45° అక్షాంశం 27నక్షత్రాలు(360°) పూర్తి చేసే సరికి 0°అక్షాంశం 29.25 నక్షత్రాలు (390°) పూర్తి అవుతుంది అలా ఎక్కువ తిరిగే 2.25 నక్షత్రాల వ్యవధిని ఒక రాశిగా నిర్ణయుంచారు దానినే రాశి సంక్రమణం అంటారు అలా సంవత్సరానికి 45°అక్షాంశం 12భ్రమణాలు పూర్తి చేస్తే 0°అక్షాంశం 13 భ్రమణాలు పూర్తి చేస్తుంది.

భూమి మీద లాగానే సూర్యుడి మీద కూడా ఒక్కో అక్షాంశ రేఖాంశాల వద్ద ఒక్కో రకమైన వేడి, రేడియేషన్ ఉంటుంది కానీ ఒక అక్షాంశం వేగంగాను మరో అక్షాంశం నెమ్మదిగాను తిరగడం వలన ప్రతీ రోజు విడుదల అయ్యే వేడి రేడియేషన్ మారుతూ ఉంటాయి మళ్ళీ అటువంటి రేడియేషన్ మరియు వేడి సంవత్సరం తర్వాత అదే రాశి మరియు నక్షత్రాల కలయిక జరిగినప్పుడే విడుదల అవుతుంది.

ధనుర్మాసం సంవత్సరం మొత్తంలో అత్యధిక రేడియేషన్ విడుదల అయ్యే మాసం కావడం వలన మన పూర్వీకులు ఆవుపేడతో ఇల్లు అలకడం మరియు ఇంటి గొబ్బిళ్ళు రూపంలో ఆవు పేడ మరియు గరికపొడి చల్లడం ద్వారా ప్రతి ఇంటిని రేడియేషన్ నుండి కాపాడుకునే వారు అలాగే శుభకార్యాలు నిషేదించడం ద్వారా దూర ప్రయాణాలు ఆపే వారు.

భూమి మీదకు రేడియేషన్ ఎక్కువగా వచ్చే మకర సంక్రమణం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మకర సంక్రాంతి 4రోజుల పండగ ద్వారా రేడియేషన్ నుండి మానవులను కాపాడటానికి వివిధ ఆచారాలు ఏర్పాటు చేశారు.

ఈ విజ్ఞానం అందుకోవడానికి ప్రస్తుతపు విజ్ఞాన ప్రపంచానికి మరో వెయ్యేళ్లు పట్టవచ్చు కానీ వేల సంవత్సరాల పూర్వమే ఋషులు సూర్య సిద్దాంతం ద్వారా ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.