Author Archives: Anudeep

గరుడ పంచమి లేదా నాగ పంచమి

శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో ” గరుడ పంచమి” ఒకటి. గరుత్మంతుడు సూర్యరధసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది.

గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమధనంలో ” ఉచ్పైశ్రవం” అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు, వినత ల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత ఆమే తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చుసారు. కద్రువ, వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా, వినత గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఒ పందెం వేసుకొన్నారు, గుఱ్ఱపు తోక నల్లగాఉంటే వినత కద్రువకు దాస్యం చేయలని, గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయలని పందెం.

కద్రువ తన కపటబుద్దితో. సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా. దానికి వారెవ్వరు అంగీకరించలేదు. కోపగించిన కద్రువ ” జనమేజయుని సర్పయాగంలో నశించాలని” శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు.

కొద్దికాలం తరువాత గర్బవతి అయిన వినత, తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బైటకురాగానే ” అమ్మా నీ తొందరుపాటువలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను, కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు” అని చెప్పి, సూర్యభగవానుడి రధసారధిగా వెళ్ళిపోయాడు. కొద్దికాలం తరువాత జన్మించిన గరుడుడు తల్లి దాశ్యం చూడలేక, దాశ్యవిముక్తి కోసం అమృతం తెచ్చివమ్మన్న నాగుల మాటకు అనుగుణంగా అమృతం తెచ్చిచ్చి, అమ్మకు దాశ్యం నుండి విముక్తి కలిగిచ్చాడు. అమృతభాండాన్ని తీసుకొని వెళ్తున్న గరుత్మంతుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో అడ్డుకొనబోగా, తన తల్లి దాస్యత్వం పోగొట్టడానికే ఇలా తీసుకెళ్తున్నానని విన్నవించాడు.

నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి.

గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యంపోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. మరి కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది.

పరమాచార్యుల అమృతవాణి : పొదుపు (పరమాచార్యుల ఉపన్యాసములనుండి)

మన కాలమంతా ద్రవ్యార్జలోనే గడచిపోతున్నది. ఈ ద్రవ్యాన్ని మనం సరిగా ఖర్చు పెట్టుతున్నామా అని యోచించాలి. మనం ఏ వస్తువునూ అవసరానికి అధికరించి కోరకూడదు. ఒక వస్తువు కొనేటపుడు, మనం బేరం చేసి ఎంత తక్కువ ధరలో కొనవచ్చునో అంత తక్కువ ధరలో కొంటాము.

Continue reading

శ్రీ కృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎప్పుడైనా చూసారా!

ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామం వద్ద ఉంది.

Parijata tree kintoor

శ్రీకృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామ కి బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలో లోని కింటూర్ గ్రామంలో ఉంది . ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఇది శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు.

Continue reading

జ్యోతిష్య శాస్త్రం లో నక్షత్ర వృక్షాలు

జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి
జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు
అశ్వని నక్షత్రం – వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటి గా

Continue reading

చంద్ర గ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా !

చంద్ర గ్రహణం ఎప్పుడు కలదు ?

ఆషాఢ శుద్ధ పూర్ణిమ అనగా తేది :16 – 07 – 2019

చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుందా ?

ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగా తేది : 16 – 07 – 2019 , మంగళ వారము రోజు ప్రారంభమగు చంద్ర గ్రహణము…. ఈ గ్రహణము మన దేశములో కనిపిస్తుంది.కావున ఇట్టి చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుంది.గ్రహణ నియమాలను తప్పక పాటించాల

గ్రహణ సమయ వివరాలు :

🔸 గ్రహణ స్పర్శ కాలము :
తేది : 16 – 07 – 2018 , మంగళ వారము , రాత్రి 01:34 ని॥లకు

🔸 *గ్రహణ మధ్య కాలము :*
తెల్లవారు జామున 03:04 ని॥లకు

🔸 *గ్రహణ మోక్ష కాలము :*
ఉదయం 04:33 ని॥లకు

గ్రహణ నియమాలు ఏ సమయం నుండి పాటించాలి ?

గ్రహణ వేధారంభ సమయం నుండి గ్రహణ మోక్ష సమయం దాకా గ్రహణ నియమాలను పాటించాలి.గ్రహణ వేధారంభం తేది : 16 – 07 – 2019 , మంగళ వారము మధ్యాహ్నము 4:34 ని॥ల నుండి గ్రహణ నియమాలను పాటించాలి.

వయస్సు రీత్యా , వ్యాధి తీవ్రత రీత్యా వృద్ధులు , ఆరోగ్య రీత్యా గర్భిణీ స్త్రీలు అన్ని గంటల పాటు గ్రహణ నియమాలను పాటించలేని , గత్యంతరము లేని స్థితి ఉన్నప్పుడు మాత్రము గ్రహణ స్పర్శ కాలము నుండి గ్రహణ మోక్ష కాలము వరకైనా గ్రహణ నియమాలను పాటించాలి.

గ్రహణాన్ని ఎవరు వీక్షించకూడదు ?

ధనుస్సు రాశి , మకర రాశి వారు

చేయవలసిన దానాలు :

ఒక నూతన ఇత్తడి పాత్రలో నిండుగా ఆవు నెయ్యి పోసి అందులో బంగారం చూరు , వెండి చంద్ర ప్రతిమ , వెండి నాగ విగ్రహము , ఒక మంచి ముత్యం వేసి దానమివ్వాలి.
తప్పకుండా గ్రహణ హోమము చేయించాలి.తెల్లటి వస్త్రము మరియు బియ్యం కూడా దానమివ్వాలి.

గ్రహణ మోక్ష కాలము పూర్తయిన తర్వాత స్నానమాచరించి , సద్భ్రాహ్మణుడికి దక్షిణ తాంబూల సమేతంగా , సంకల్పయుక్తంగా పై సూచించిన దానాలు ఇవ్వాలి.

అపాత్ర దానం శూన్య ఫలాన్నిస్తుందని గరుణ పురాణంలో పేర్కొనబడినది.కావున ఎవరికిపడితే వారికి కాకుండా మీ మీ ప్రాంతాలలో ఉన్న సదాచార సంపన్నులు , నిష్ఠా గరిష్ఠులు , నిత్య జప-తప-హోమ యాగ క్రతువులు చేయువారు , నిత్య దేవతార్చన చేయువారు , వేదాధ్యయనము చేసిన వేద మూర్తులైన బ్రాహ్మణ పండితులకు దానమీయవలెను.అప్పుడే దాన ఫలితము లభించును.

గ్రహణ సమయంలో నదీ స్నానం చేసి , నదీ తీరములో అనుష్ఠానము చేసుకోవడం సంపూర్ణ ఫలప్రదము,పుణ్య ప్రదము.