Gemology – Ruby

Ruby pic

నవగ్రహాలలో సూర్యునికి కెంపు,చంద్రునికి ముత్యం,కుజునికి పగడం,రాహువుకు గోమెధికం,గురువుకు కనక పుష్య రాగం,శుక్రునికి వజ్రం,శనికి నీలం,బుధునికి పచ్చ,కేతువుకు వైడూర్యం అనువయిస్తాయి. ఈ రత్నాలు ధరించడంలో వివిధ పద్దతులు అనుసరిస్తున్నారు.జన్మ నక్షత్రాలకు అధిపత్యం గల గ్రహానికి ఏ రత్నం అనువయిస్తుందో అది ధరించడం ఒక పద్దతి.జన్మ లగ్నానికి కాని జన్మ రాశికి కాని అధిపత్యం గల గ్రహానికి ఏ రత్నం వర్తిస్తుందో ఆ రత్నం ధరించడం ఒక సంప్రదాయం. ఏ గ్రహ దశ నడుస్తున్నదో ఆ గ్రహానికి సరిపడే రత్నం ధరించడం మరొ పద్దతి.

రత్నాలు ధరించడానికి సరైన కారణం ఉండాలి.అందులో ముఖ్యంగా రోగ పీడ,శత్రుభయం,ఋణ బాధ,ప్రమాద భయం,ఆర్ధిక సమస్య,దాంపత్యంలో కష్టాలు,వివాహం కాకపోవడం,మనోవ్యాకులత,రాజ భీతి – ప్రభుత్వ దండన,నిరుద్యగ సమస్య,సంతానం లేకపోవడం,భూత పిశాచ బాధలు,విద్యలో పరాజయం,మరణ భీతి,లిటిగేషన్స్ పనులకు ఆటనంకాలకు మొదలైన చిక్కుల నుండి తప్పించుకుని బాగు పడటానికి దోష నివారణ రత్నం ఉపయోగ పడుతుంది.

అంతే గాక అనేకానేక రకరకాల కోరికలుంటాయి.ఉద్యోగం రావాలనీ,ప్రమోషన్ రావాలనీ,రాజకీయంగా ఎదగాలని,అధికార పదవులు రావలనీ,వ్యాపారభివృద్ది జరిగి ఆస్తులు,ఆభరణాలు,వాహనాలు లభించాలని అభిలాష.ఏ గ్రహం సహకరిస్తుందో తెలుసుకొని ఆ రత్నం ధరించడం ఆనవాయితి.

అందులో భాగంగా మనం ఈ రోజు సూర్య గ్రహా రత్నం అయినటువంటి కెంపు గురించి తెలుసుకుందాం.

కెంపు రత్న ధారణ వల్ల ఆరొగ్యం,ఉద్యోగం,రాజకీయధికారం,ప్రమొషన్,అధికారుల మెప్పు,పితృ సౌఖ్యం,నేత్ర రోద,హృదయ రోగ నివారణ మొదలైనవి సూర్యుని వల్ల జరిగేవి.కనుక వీటికొసం సూర్య గ్రహా రత్నమైన కెంపు ధరించాలి.కృత్తిక ,ఉత్తర(ఫల్గుని), ఉత్తరాషాడా నక్షత్రాలకు సూర్యుడు అధిపతి.ఈ నక్షత్రాలలో జన్మించినవారు కెంపు ధరించవచ్చు.సింహా రాశి అధిపతి సూర్య భగవానుడు కావునా సింహా లగ్న జాతకులు సింహా రాశి వారు ఈ కెంపు ధరించవచ్చు.సూర్యుడు దుష్ట స్థానాలలో దుర్భల రాశులలో ఉండగా జన్మించిన వారు సూర్య దశ జరుగుతున్న వారు కూడా కెంపు ధరించవచ్చు.జ్యోతిష రత్న శాస్త్రాలలో అనుభవం గల ప్రముఖులను సంప్రదించి వారి సలహాలపై ఈ రత్నమైన ధరించడం మంచిది.

Anudeep Sharma Kappakanti
MA Astrolgy (Graduate from PSTU) call me on 9848272621
Online Astrology – Vaastu – Birth stones
Performing all kind of Poojas, Abhishekas, Homas, Marriage and Gruhapravesh
Match making – Dosha nivarana Poojas (95% results)

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.