Monthly Archives: June 2015

కైలాస పర్వతం – mount Kailash

kailas1 పరమేశ్వరుడు…పార్వతి సమేతంగా ఈ భువిపైనే ఉన్నాడు. మనముంటున్న ఈ భూమిపైనే ఆయన కూడా మన కోసం నివాసముంటున్నాడు. ఇక్కడే ఈ గాలిలో, ఈ నేలలో ఈ మట్టిపైనే ఉంటూ భక్తుల్ని సాక్షాత్కరిస్తున్నాడు. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజం. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో ఆకాశంలోనో లేదా మరో లోకంలోనో లేదు. ఆయన కైలాసం ఇక్కడే ఉంది. మన దేశానికి కూతవేటు దూరంలో ఉంది. చైనా ఆక్రమిత, టిబెట్‌లోని హిమాలయ పార్వత సానువుల్లో సిద్ధ పురుషులకు ఆవాసమైన మంచుకొండల నడుమ ఉంది. Continue reading

సనాతన ధర్మం – తెలుసుకోదగ్గ విషయాలు

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు. Continue reading

మన సంస్కారాల అంతరార్థం

భారతీయ సంస్కౄతిలో చెప్పబడినవన్నీ సమజహితం కోసమే ఉద్దేశించబడినవి. సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయయలు మానవ వికాసానికై ౠషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయలనే సంస్కారాలు అని చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి.
మనుస్మౄతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది. 1. వివాహాం, 2. గర్భాధానం, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణం, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం. అయితే మరికొంతమంది స్మౄతికాకురులు ఈ సంస్కారలను షోడశ (16) సంస్కారాలుగా పేర్కొన్నారు. Continue reading

వట సావిత్రీ వ్రతము

హైందవ సంస్కృతి లో , ఆధ్యాత్మిక జీవన విధానము లో పురుషుల తో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది . ఆచార వ్యవహారాలు , సాంప్రదాయాలు , కుతుంబ క్షేమము కోసము , కట్టుకున్న భర్త , బిడ్డలకోసం … పురుషులకంటే స్త్ర్త్రీలే ఎక్కువగా ధైవారాధన లో నిమగ్నులైవుంటారు . ధర్మార్ధ , కామ , మోక్షాల కొరకు నడిచే బాటలో దారితప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋఉషివర్యులు ఏర్పరచినవే ఈ పండుగలు , వ్రతాలు , నోములు , ఉపవాసాలు మొదలైనవి . విధిని తమకు అనుకూలం గా మలచుకునేందుకు దైవాన్ని ప్రసన్నము చేసుకొని కుటుంబ క్షేమం కోసము స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో ” వట సావిత్రీ వ్రతము ” ఒకటి ముఖ్యమైనది .

తన పాతివ్రత మహిమతో యమధరమరాజు నుంచి తన భర్త ప్రాణాలను మెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు . తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వ్రుక్షమైన మర్రిచెట్టును భక్తిప్రపత్తులతో పూజించింది Continue reading

ఒక యోగి ఆత్మకథ

IMG_0878(2)ఒక యోగి ఆత్మ కథ నన్ను బాగా ఆకర్షించిన కొన్ని విలువైన ప్రచురణలొ ఇది మొదటిది.ఎదో మనకు తెలువనిది ఈ ప్రపంచం లొ దాగి ఉంది అని చెప్పె ఈ ప్రచురణ నాకు చాల ఇస్టం కుడా. వీలుంటే చనిపొయే లొపు ఒక్క సారి ఈ పుస్తకాన్ని చదవండి.

కృతికర్త: పరమహంస యోగానంద
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విడుదల: 1946

ఒక యోగి ఆత్మకథ ప్రముఖ భారతీయ యోగి పరమహంస యోగానంద రచించిన సంచలన ఆధ్యాత్మిక రచన. ఇందులో ఆయన ఆత్మకథను పొందుపరిచాడు. ఈ పుస్తకం ఎంతో మంది విదేశీయులకు యోగాను, ధ్యానాన్ని పరిచయం చేసింది. ఇప్పటి దాకా దాదాపు 25 భాషల్లోకి అనువదించబడింది. ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ఈ పుస్తకం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. Continue reading