Tag Archives: temple

దర్మపురి ఉగ్ర నరసింహుడి అవతార కథ

Dharmapuri Lakshmi Narasimha1

Dharmapuri Lakshmi Narasimha1

పౌరాణికం: ధర్మపురి క్షేత్రానికి హిరణ్యకశిపునకు దగ్గర సంబంధం ఉన్నది. రాక్షసుడైన హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి అతనిని మెప్పించాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ హిరణ్యకశిపుని ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.. ఇంకేముంది. క్రూరుడైన రాక్షసునికి బ్రహ్మ అండదండలు లభించాయి. తనకు మరణం ఉండకూడని విధంగా వరం కోరాడు. బ్రహ్మ ఈ కోరికకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే తనకు దేవతలతో, మానవులతో, మృగాలతో, ఆయుధాలతో, పగటి వేళ, రాత్రివేళ, ఇంట్లో, బయటా భూమిపై, ఆకాశంలో మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. గత్యంతరం లేకుండా బ్రహ్మ వరం ప్రసాదించి వెళ్ళాడు. అసలే రాక్షసుడు. పైగా బలవంతుడు. ఇప్పుడు మరణం లేకుండా వరం పొందినవాడు. దీనితో హిరణ్యకశిపుడు విజృంభించాడు. అడ్డు అదుపు లేకుండ పోయాడు. ముల్లోకాలపై ఆధిపత్యం ప్రకటించాడు.. Continue reading

శివ సందర్శన విధి

శివ  సందర్శన విధిసాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందికే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది. Continue reading

సంక్రాంతి విశేషాలు

బోగిపళ్ళు

బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు Continue reading

శ్రీ ఆంజనేయ స్వామిని శనివారం పూజిస్తే ?

You can pray to hanuman on saturday, hanuman pooja saturday,important days for hanuman, hanuman pooja benefit saturday

శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే శనివారం శ్రేష్టమైనది.
“సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః”

అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా కాని,  కార్తీక శుద్ధ ద్వాదశినాడు కాని శనివార వ్రతం చేయాలి.

Continue reading