దర్మపురి ఉగ్ర నరసింహుడి అవతార కథ

Dharmapuri Lakshmi Narasimha1
Dharmapuri Lakshmi Narasimha1

పౌరాణికం: ధర్మపురి క్షేత్రానికి హిరణ్యకశిపునకు దగ్గర సంబంధం ఉన్నది. రాక్షసుడైన హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి అతనిని మెప్పించాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ హిరణ్యకశిపుని ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.. ఇంకేముంది. క్రూరుడైన రాక్షసునికి బ్రహ్మ అండదండలు లభించాయి. తనకు మరణం ఉండకూడని విధంగా వరం కోరాడు. బ్రహ్మ ఈ కోరికకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే తనకు దేవతలతో, మానవులతో, మృగాలతో, ఆయుధాలతో, పగటి వేళ, రాత్రివేళ, ఇంట్లో, బయటా భూమిపై, ఆకాశంలో మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. గత్యంతరం లేకుండా బ్రహ్మ వరం ప్రసాదించి వెళ్ళాడు. అసలే రాక్షసుడు. పైగా బలవంతుడు. ఇప్పుడు మరణం లేకుండా వరం పొందినవాడు. దీనితో హిరణ్యకశిపుడు విజృంభించాడు. అడ్డు అదుపు లేకుండ పోయాడు. ముల్లోకాలపై ఆధిపత్యం ప్రకటించాడు..

దేవతలను, మానవాళిని వేధింపసాగాడు. హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. బాల్యంలోనే భాగవతుడైనాడు. ఇది తండ్రికి నచ్చలేదు. విష్ణుభక్తిని మానుకొమ్మని నచ్చచెప్పాడు, ఫలితం లేకపోగా, చివరకు ప్రహ్లాదుని చంపడానికి కూడా వెనుకాడలేదు.

దేవతలు విష్ణువుకు తమ గోడు విన్నవించుకొన్నారు. హిరణ్యకశిపునకు అంతం వచ్చింది. అతనికి పగలు, రాత్రి, ఆయుధాలతో, మానవులతో, మృగాలతో మరణం లేదు కాబట్టి విష్ణువు సాయం సంధ్య వేళ, సగం మానవుడు సగం సింహం స్వరూపుడైన నరసింహావతారంతో, స్థంభం నుండి వెలువడి, గడప వరకు లాగుకొని వెళ్లి గడపపై తన ఒడిలో వేసుకొని గోళ్లతో చీల్చి సంహరించాడు. హిరణ్యకశిపుడు భూమిపై, ఆకాశంలో మరణం లేకుండా వరం పొందిన కారణంగా విష్ణువు అతడిని ఒడిలో వేసుకొని చంపవలసి వచ్చింది.

హరణ్యకశిపుని వధ తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చాడు. శాంతించాలని దేవతలు స్వామిని ప్రార్థించారు. శాంతించిన నరసింహుడు ధర్మపురి చేరుకొని అక్కడ యోగముద్రతో ధ్యానం చేశాడని ఐతిహ్యం.

ధర్మపురి ఆలయంలో శివుడు రామలింగేశ్వరుడుగా వెలిశాడు. దీనితో ధర్మపురి హరి హర క్షేత్రమైనది. ఇక్కడ గోదావరి నది బ్రహ్మగుండం, సత్యవతి గుండం, పాలగుండం, చక్రగుండంగా ప్రవహిస్తున్నది.చారిత్రకం: ధర్మపురి రాజు ధర్మవర్మ నరసింహునికి ఆలయం కట్టించాడు. దీనితో పట్టణానికి ధర్మపురి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రం క్రీ. పూ. 850 సంవత్సరంలోనే ఉండిందని ఆలయ శాసనాలు పేర్కొంటున్నాయి. 1422- 36 మధ్య బహుమని సుల్తానులు ఆలయాన్ని ధ్వంసం చేశారని, 17 వ శతాబ్దంలో ఆలయ పునర్నిర్మాణం జరిగిందని చారిత్రక వివరాలు వెల్లడిస్తున్నది.

ధర్మపురి కి వెళ్ళిన వారు యమపురి కూడ వెళ్ళరని నానుడి.(ధర్మపురికి వచ్చినవారికి యమపురి ఉండదు).

DharmapuriKshetraMahatyam
DharmapuriKshetraMahatyam
stivals at LakshmiNarasimha
stivals at LakshmiNarasimha
Visiting Places at Dharmapuri
Visiting Places at Dharmapuri

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.