Tag Archives: telangana

దర్మపురి ఉగ్ర నరసింహుడి అవతార కథ

Dharmapuri Lakshmi Narasimha1

Dharmapuri Lakshmi Narasimha1

పౌరాణికం: ధర్మపురి క్షేత్రానికి హిరణ్యకశిపునకు దగ్గర సంబంధం ఉన్నది. రాక్షసుడైన హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి అతనిని మెప్పించాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ హిరణ్యకశిపుని ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.. ఇంకేముంది. క్రూరుడైన రాక్షసునికి బ్రహ్మ అండదండలు లభించాయి. తనకు మరణం ఉండకూడని విధంగా వరం కోరాడు. బ్రహ్మ ఈ కోరికకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే తనకు దేవతలతో, మానవులతో, మృగాలతో, ఆయుధాలతో, పగటి వేళ, రాత్రివేళ, ఇంట్లో, బయటా భూమిపై, ఆకాశంలో మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. గత్యంతరం లేకుండా బ్రహ్మ వరం ప్రసాదించి వెళ్ళాడు. అసలే రాక్షసుడు. పైగా బలవంతుడు. ఇప్పుడు మరణం లేకుండా వరం పొందినవాడు. దీనితో హిరణ్యకశిపుడు విజృంభించాడు. అడ్డు అదుపు లేకుండ పోయాడు. ముల్లోకాలపై ఆధిపత్యం ప్రకటించాడు.. Continue reading