Tag Archives: ఉపవాసం

వరలక్ష్మి వ్రతం (పూజా విధానం )

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు.వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు, లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.

వ్రత విధానం :
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.

Continue reading

మనుస్మృతి వచనం – తొమ్మిదింటిని దర్శించునప్పుడు వట్టి చేతులతో పోరాదు

శ్లో! అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ
                               రిక్తహస్తేన నోపేయాత్, రాజానం దైవతం గురుమ్
                                                                              –మనుస్మృతి.
అగ్నిహోత్రము, స్వగృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీ, ముసలివారు, పిల్లలు, రాజు, దైవము, గురుడు, ముఖ్యంగా ఈ తొమ్మిదింటిని దర్శించునప్పుడు వట్టి చేతులతో పోరాదు. మధురమైనా, పండైనా, పూవునైనా తీసుకొనిపోవాలి.

Continue reading

ఆత్మీయ మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు!!

ఆత్మీయ మిత్రులందరికీ  ” మహాశివరాత్రి” శుభాకాంక్షలు!!

మహాశివరాత్రి పర్వదినమున ఒకసారి ఈ “శివకవచము”ను అందరూ ఒక సారి మీకు వీలైనపుడు పఠించె ఈశ్వరుని అనుగ్రహం పొందగలరు.
శివకవచము:
ఓం నమో భగవతే సదాశివాయ!
సకలతత్వాత్మకాయ! సర్వమంత్రస్వరూపాయ! సర్వయంత్రాధిష్ఠితాయ! సర్వతంత్రస్వరూపాయ! సర్వతత్వవిదూరాయ!
బ్రహ్మరుద్రావతారిణే నీలకంఠాయ! పార్వతీమనోహరప్రియాయ! సోమసూర్యాగ్నిలోచనాయ! భస్మోద్ధూలితవిగ్రహాయ!
మహామణి ముకుటధారణాయ! మాణిక్యభూషణాయ! Continue reading

మహాశివరాత్రి – విశేషాలు

మహాశివరాత్రి ఒక హిందువుల పండుగ. దేవుడు శివుడుని భక్తితో కొలుస్తూ ఏటా జరుపుకుంటారు. ఇది శివ, దేవత పార్వతి వివాహం జరిగింది రోజు. మహా శివరాత్రి పండుగను కూడా ప్రముఖంగా ‘శివరాత్రి’ గా పిలుస్తారు. (అంతేకాక శివరాత్రి, సివరాత్రి, శైవరాతిరి, శైవవరాత్రి, మరియు శివరాతిరి అని కూడా పలుకుతారు) మరికొందరు ‘శివుడి యొక్క గ్రేట్ నైట్’, అని లేదా శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు.
మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని Continue reading

మహా శివరాత్రి ఆవశ్యకత – మృగశిర నక్షత్ర జన్మ వృత్తాంతం

మన పండుగలన్నీ తిధులతోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ లెక్కన శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహా శివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాస శివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును మాస శివ రాత్రిగా చెప్తుంటారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. మాఘ బహుళ చతుర్దశి అర్దరాత్రి వరకు వ్యాపించి లేకపోతే అనగా అమావాస్య ముందే ప్రవేశించినట్లు అయితే అంతకుముందు రోజు మహా శివరాత్రి అవుతుంది. ఈ లెక్కన మహా శివ రాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు. మహా శివరాత్రి ఒకవేళ మంగళ వారం రోజున వస్తే దానికున్నవిశేషం చెప్పలేనిదని ధర్మ సింధువు మాట. Continue reading