June Monthly horoscope in Telugu

మేష రాశి: రోజువారి కార్యక్రమాలు బాగుంటాయి.ఆరొగ్య విషయంలోమంచి మార్పులు చొతు చేసుకుంతయి.ఉద్యోగ వ్యాపార విషయాలలో అభివృద్ది పథంలో ముందుకు వెళ్లే అవకాశం.18 వ తేది తర్వాత కొద్దిగ చికాకులు ఉంటయి.యాత్రలు,ప్రయాణాల నిమిత్తం కొద్దిగా డబ్బు ఖర్చు చేస్తారు.ఆదాయం ఎలా ఉన్న ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది.అప్పు చెసే అవకాశాలు కనిపిస్తున్నాయి.అంజనేయ స్వామి ఆరాధన చేయండి.

వృషభ రాశి: గ్రహచారం అనుకూలంగానే ఉంటుంది.రవి సంచారం బాగుండని కారణంగా ఉద్యోగ వ్యాపార విషయాలలో అధికారికంగా ద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం.దూర ప్రాంత ప్రయాణాలు,అనవసరవ ప్రయాణాలు అధికమవుతయి.ఆదాయం బాగున్నను ఖర్చులు అధికంగా ఉంటాయి.పనులు చేసేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి గాయలయ్యె అవకాశం. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి.

మిథున రాశి: చిన్న చిన్న చికాకులు తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది.మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం.అకాల భోజనం, వస్త్రధారణ లో మార్పు.స్థాన చలనం(ట్రాన్స్ఫర్), ప్రమోషన్ లో అధికారులతో ఇబ్బంది.సమస్యాత్మక కాలం అయితే కాదు.అయితే తదనుకూలంగా సమస్యలు ఎర్పడే అవకాశం.ఆరొగ్య,ఆర్ధిక విషయాలల్లో జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు లేని జీవితం గడిపే అవకాశం. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి.

కర్కాటక రాశి: తెలివి ఓర్పుతో అన్ని పనులు చేసినాపటికి కార్యక్రమములు శ్రమతో కూడుకుని పూర్తవుతు ఉంటాయి.అనవసర ప్రయాణాలు వృధా ఖర్చులు అధికమవుతయి.శుభ,పుణ్య కార్యక్రమాలు తరచుగా పాల్గొనే అవకాశం.అకాల భోజనం 18 వరకు ఉంటయి.ఆ తరువాత కొద్దిగా మార్పు. అన్ని అవకాశాలు ముందు ఉన్న వాడుకోలెని పరిస్తితి.శ్రీ రాముని నామ పారయణం చేయండి శుభాలు జరిగే అవకాశం. 

సింహ రాశి: ఆరొగ్య విషయాలలో జాగ్రత్త.వ్యవహార విషయాల్లో జాగ్రత్త అవసరం.జ్ఞాతి వైరమునకు దూరంగా ఉండాలి.శారిరకముగా చిన్న చిన్న సమస్యలు తప్పవు. మీ వ్యవహార విషయాలలో ఎవరి ప్రమేయం ఉండకుండా చూసుకుంటే మంచిది.అంతా అనుకూలంగ ఉన్నప్పటికి ఎదో ఒకరకమైన సమస్య ఉన్నట్టనిపిస్తుంది.ప్రతి పని తనది తాను చేసుకొవడం ఉత్తమం.ఎవరి మీద ఆధరపడవద్దు.ఇష్ట దేవాతారాధన శ్రేయస్కరం.

కన్య రాశి: దైనందిన కార్యక్రమాలు దిగ్విజయంగా నడుస్తాయి.18 వ తేది తర్వాత కొన్ని విఘ్నాలు ఎర్పడే అవకాశం.ఆరొగ్య సమస్యలు ఉండే/పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి.దూర ప్రాంత ప్రయాణాలు వాయిదే వేస్తే మంచిది.కుటుంబ విషయాలలో జాగ్రత్త.ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. దీర్ఘ కాలిక పనులు 18 లోపు నెరవేర్చడం మంచిది లేదంటే వాయిదా పడే అవకాశం.శివాభిషేకం శ్రేయస్కరం.

తులా రాశి: క్రమక్రమంగా ఈ రాశి వారికి వారి యొక్క సమస్యలు తగ్గు ముఖం పట్టే అవకాశం.ఉద్యోగం,వ్యాపరం,అర్ధిక,ఆరొగ్య విషయాలల్లో అనుకూలం.విదేశి నివాస ప్రయత్నాలు,స్తిరాస్థి కొనుగోలు విషయాలలో అనుకూల పరిస్తితి.ప్రతి పని కూడా విజయవంతమవుతుంది.అందరికి సహక్కరం చేస్తారు.అందరి సహకారం మీరు పొంది ఈ మాసం చాల మంచిగా సాగుతుంది.దైవ బలం తోడుగా ఉంటుంది.ఇష్ట దేవాతరాధన చేయండి.

వృశ్చిక రాశి: ఈ మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.తరచుగా ఇబ్బంది కలిగించే విషయాలలో మనస్సు నిమగ్నం కావడం జరుగుతుంది.అనారొగ్యం లేనప్పటికి,ఆరొగ్య సమస్యలు ఉన్నట్లుగా భావించే అవకాశం.దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం.పుణ్య క్షేత్ర సందర్శన, పుణ్య కార్యాలు, శుభ కార్యాలు చెసే అవకాశం.మాసం చివర్లో ఆర్ధిక లావాదేవీలు, ఆరొగ్య విషయాలు ఇబ్బంది పెట్టే అవకాసం. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల ఇబ్బంది తొలిగే అవకాశం. 

ధనస్సు రాశి: కుటుంబ విషయాలలో సౌఖ్యం తక్కువ.ఆర్ధిక, ఆరొగ్య విషయాలలో సానుకూలత.దైనందిన కార్యక్రమంలో ప్రతి విషయంలోను గొప్యత ఉంచాలి.జాగ్రత్త పాటించాలి.కొన్ని సంధర్భాలలో చక్కటి లాభదాయకమైన ఫలితాలుండే అవకాశం. కొన్ని అనవసర ఆలొచనలతో నష్టాలు పొందే అవకాశం ఉంటుంది.విష్ణు సహస్ర నామ పారయణ స్రేయస్కరం.

మకర రాశి: ఈ మాసంలో గత మాసం కంటే ఫలితాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నప్పటికి దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దు.ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకొవడం అన్నింటా శ్రేయస్కరం.మధ్యవర్తిత్వం కాని ఇతరుల విషయాలలో శ్రద్ద చూపడం మంచిది కాదు.శుభ,పుణ్య కార్య విషయాలలో ధనవ్యయం.ఋణ సమస్యల విషయాలలో పరిష్కారం కొరకు వెతుకుతారు. ఋణ అంగారక స్తొత్ర పారయణ చేయండి.

కుంభ రాశి: ఆరోగ్య విషయంలో సమస్యలు పెరగకుండా జాగ్రత్త తీసుకొవడం మంచిది.దైనందిన విషయాల్లో కుటుంబ విషయాల్లో మీ ప్రవర్తన కలహ ప్రదంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగ ఉండకపొతే దగ్గరి వారు దూరమయ్యే అవకాశం ఉంటుంది.మానసిక అందోళన ప్రతి విషయంలో ఉంటుంది.ఓర్పు తెలివి ఒకటికి పది సార్లు అలోచించి పని చేస్తే విజయం మీ సొంతం అవుతుంది. ఇష్ట దైవ ధ్యానం చేయండి.

మీన రాశి:  ఈ నెల రోజులు లాభదాయకంగా జీవనకాలం ఉంటుంది.దైనందిన కార్యక్రమాలు కుటుంబ వ్యవహారాలు అధిక ధన వ్యయాన్ని సూచిస్తున్నాయి.ఉద్యోగ వ్యాపార విషయంలో రవి,కుజ ప్రతికూల సంచారం చేత ఇబ్బందులు తలెత్తుతాయి.ఋణ విషయాలలో కూడా సమయానికి అందక కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.దైవ నామస్మరణ సూర్య నమస్కారం వల్ల కుజ స్తొత్ర పారయణం వల్ల శ్రేయస్కరం.

మరిన్ని విషయాలు వ్యక్తి గతంగా తెలుకోవాలనుకుంటే సంప్రదించండి:

కప్పకంటి అనుదీప్ శర్మ (MA Astrology)

శ్రీ అభయాంజనేయ స్వామి ఉపాసకులు

శ్రీ బాలరాజేశ్వర వాస్తు జ్యోతిష నిలయం .

 ph no : 9848272621.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.