స్వస్తిశ్రీ చాంద్రమాన శార్వరి నామ సంవత్సర
జ్యేష్ఠ బహుళ అమావాస్య, మృగశిర నక్షత్రం ఆదివారం, తేదీ: 21.6.2020 రోజున మిథున రాశిలో రాహుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది.
ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును . చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును .
స్పర్శకాలం ప్రారంభం ఉ. 10.25 ని.
మధ్యకాలం మ.12.09 ని.
అంత్య కాలం మ.1.55 ని.
ఆద్యంత పుణ్యకాలము 3 గం. 29 ని.
తెలంగాణ రాష్ట్రానికి
గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.14
గ్రహణ మధ్యకాలం : ఉ . 11.55
గ్రహణ అంత్యకాలం : మ . 1.44
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు
ఆంధ్ర రాష్ట్రానికి
గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.23
గ్రహణ మధ్యకాలం : మ .12.05
గ్రహణ అంత్యకాలం : మ . 1.51
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు
ఈ గ్రహణం మృగశిరా నక్షత్రం మిథున రాశిలో ఉంది కనుక, మృగశిర నక్షత్రం వారు, మిథున రాశి వారు గ్రహణం వీక్షించరాదు. ఎవరు కూడా సూర్యగ్రహణాన్ని నేరుగా వీక్షించడం మంచిది కాదు.
వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి మరియు మీన రాశుల వారు గ్రహణం అనంతరం లేదా సోమవారం రోజు దానం చేసుకోవాలి.
దానం చేయవలసిన వస్తువులు:
గోధుమలు, మినుములు, ఆవు నెయ్యి తో కూడిన రాగి పాత్ర, నాగ ప్రతిమ, సూర్య ప్రతిమ, ఎరుపు రంగు, నీలం రంగు వస్త్రము తో పాటు యథాశక్తి దక్షిణ మరియు భోజన సాహిత్యం ఇవ్వవలెను.
గ్రహణం అనంతరం నిత్య భోజనము మరియు ప్రత్యాబ్దికం అనగా తద్దినం చేసుకోవలెను. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు గ్రహణానికి రెండు గంటల ముందు అల్పాహారం తీసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఎవరు కూడా ఎటువంటి ఆహార పానీయాలు స్వీకరించరాదు.
గ్రహణం కంటే ముందే దర్భా లేదా గరిక మనం తీసుకునే ఆహార పానీయాల పైన వేయవలెను.
ఈ సూర్యగ్రహణం ఆదివారం సంభవిస్తున్నందున ఇది చాలా విశేషం.
ఈ గ్రహణ సమయం చాలా విశేషమైనది, కనుక ప్రతి ఒక్కరు జప తర్పన, హవన, దానాదులు, అలాగే స్తోత్ర పారాయణము చేసిన అనేక వేల రెట్ల ఫలితం మనకు లభిస్తుంది.
గ్రహణ ప్రారంభంలో మరియు చివరలో స్నానము చేసిన మంచి ఫలితం లభిస్తుంది అలాగే ఆరోగ్యదాయకం.
ఎక్కడైతే మనకు గ్రహణం కనిపిస్తుందో అక్కడ ఈ నియమాలన్నీ వర్తిస్తాయి, కానీ గ్రహణం కనపడని చోట ఎటువంటి నియమాలు వర్తించవు.
Pingback: చూడామణి యోగం – సోమవారం – చంద్ర గ్రహణం – రాఖి పౌర్ణమి – 07-08-2017 | శ్రీ బాలరాజేశ్వర వాస్తు జ్యోతిష నిలయం