కర్నాటక రాష్ట్రంలో ఉత్తరకన్నడ జిల్లాలో గల సిరిసి ప్రాంతానికి 17కిలోమీటర్ల దూరంలో, పశ్చిమఘాట్ లో, అడవి మధ్యలో సహస్రలింగ అనే ప్రాంతం ఉన్నది.
అక్కడ శల్మలా అనే నదిలో రాళ్లలో శిలలలో చెక్కబడిన వందలాది శివలింగాలను మనం తిలకించవచ్చు.
అయితే, అవి ఎవరు చెక్కినవి అనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు, అయితే, కొందరు మాత్రం ఈ లింగాలు 1678 – 1718 నాటి సిరిసి రాజు సదాశివరాయుడు నిర్మింపచేశాడు అని చెపుతుంటారు.
శివలింగాల ఎదురుగా బసవన్న విగ్రహాలు కూడా చెక్కి వుండడం విశేషం.
శివరాత్రి పర్వదినాన ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివచ్చి, పూజలు చేసుకుంటారు. ఆ సమయంలో ఇక్కడ ప్రవాహం తక్కువగా ఉండడం విశేషం. అందువలన ఎక్కువ శివలింగాలను దర్శించుకునే అవకాశం కలుగుతుంది.
ఈ శివలింగాలు, ఆ నదీ ప్రవాహంతో నిత్యం అభిషేకించబడుతూ ఉంటాయి.
– భారత్ టుడే