సూర్య గ్రహణం నియమ నిబంధనలు గ్రహణ దోష నివారణ పూజలు జపాలు 26-12-2019

డిసెంబర్ 26 న సంపూర్ణ సూర్యగ్రహణం:

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య తేదీ డిసెంబర్ 26 గురువారం 2019 న సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. “ధనుస్సు” రాశి మూల నక్షత్రం “ధనుస్సు, మకర , కుంభ” లగ్నాలలో కేతుగ్రస్త కంకణ సూర్య గ్రహణం సంభవించును.ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా , ఆస్ట్రేలియా ఖండాలలో కనబడును. ఖగోళంలో ఈ గ్రహణం 3 గంటల 09 సెకండ్లు ఉంటుంది. కర్ణాటక , తమిళనాడు ,కేరళలోని కొన్ని ప్రాంతాలలో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాలలో ఉండును.

పై మూడు రాష్టాలు మినహాయించి మిగిలిన తెలంగాణ ,ఆంద్రప్రదేశ్ తో పాటు భారతదేశంలోని ఇతర రాష్టాలన్నింటిలో పాక్షిక సూర్యగ్రహణం గోచరిస్తుంది. హైదరాబాదులో ఉదయం 8 :08 నిముషాలకు సూర్యగ్రహణ స్పర్శ ప్రారంభమై మధ్యకాలం 9:30 చేరుకుంటుంది. ఉదయం 11 :10 నిమిషాలకు ” పుణ్యకాలం ” ముగుస్తుంది.

గ్రహణ సమయంలో సూర్యుడు అగ్నివలయంలాగా గ్రహణం చుట్టూ కనపడతాడు. కేరళలోని చెరువుత్తూర్ లో దేశంలో అన్ని ప్రాంతాల్లో కంటే సూర్య గ్రహణ దృశ్యం సుందరంగా ఉండబోతోంది.

గ్రహణం ఎవరికైనా గ్రహణమే కావునా ద్వాదశ రాశులవారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది.

గ్రహణ శాంతి మరియు పూజలు జపాల కొరకు సంప్రదించండి: అనుదీప్ శర్మ: 9848272621

ఈ గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యక్షంగా చూడ కూడదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భగవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.

గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భగవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.

గర్భినిలు కదలకుండా పడుకోవాలి అనే అవాస్తవాన్ని నమ్మకండి. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును, ఇందులో ఎలాంటి సందేహాలు పడకూడదు.

గ్రహణ సమయంలో మల, మూత్ర విసర్జనలు చెయకూడదు అనే అపోహలు వద్దు, అది వాస్తవం కాదు యదావిధిగా మల, మూత్ర విసర్జన చేయవచ్చు. .

ఆ వేళలో ఆహార పానీయ నియమాలు

అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్ధాలు గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు, జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును.

గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి.

ఉదయం చేసిన అన్నం కూరలు మొదలగునవి తినుటకు పనికి రాదు.

కారణము ఏమనగా గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పధార్ధాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి.

అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిధానంగా శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి తినకూడదు అని శాస్త్రాలు, పెద్దలు చెబుతుంటారు.

గ్రహణ శాంతి మరియు పూజలు జపాల కొరకు సంప్రదించండి: అనుదీప్ శర్మ: 9848272621

శాస్త్రీయ పద్ధతి అవసరం

గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్దతిని ఆచరించాలి అనుకునేవారు వారి శారీరక శక్తి, జిజ్ఞాస ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు, తర్వాత పట్టు, విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భగవత్ స్మరణతో ఉండగలిగితే మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్తాయిలో ఫలితం లభిస్తుంది.

ముసలివారు, చిన్నపిల్లల్లు, గర్భినిలు, అనారోగ్యంతో ఉన్నావారు చేయకూడదు. చేయనిచో ఏమో అవుతుందనే భయపడకండి. ఏమీ కాదు. తర్వాత ఇలా చేయాలి.

గ్రహణం పూర్తి అయిన తరవాత ఇంట్లో దేవున్ని శుద్ధి చేసుకోవాలి.

విగ్రహాలు, యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి.

జంద్యం(గాయత్రి) వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి.

ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి శాస్త్రోకంగా కూశ్మాండా (గుమ్మడికాయ) పూజా విధి విధానంగా చేయించి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభఫలితాలను ఇస్తాయి.

మీ మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు. పూజలు చేయించుకున్న తర్వాత ఆవునకు తోటకూర, బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి, పేదలకు ఏదేని ఆహర, వస్త్ర, వస్తు రూపంలో ధానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు, గ్రహభాదలు కొంతవరకు నివారణ కలిగి భగవత్ అనుగ్రహం కలుగుతుంది.

గ్రహణ శాంతి మరియు పూజలు జపాల కొరకు సంప్రదించండి: అనుదీప్ శర్మ: 9848272621

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.