వాస్తు విషయాలు : దక్షిణ, పశ్చిమాలలో వీధి గల స్థలము

దక్షిణ, పశ్చిమాలలో వీధులు కలిగి ఉంటే ఆ స్థలాన్ని నైరుతి బ్లాకు అంటారు. వాస్తు ప్రకారం వుంటే ఈ నైరుతి బ్లాకు బాగా రాణిస్తుంది. నైరుతి బ్లాకులో పెద్దకట్టడాలు వుండి వ్యాపార రంగంలో స్థరమైనస్థాయిని పొందిన భవనాలను మనం ఏన్నో గమనింపవచ్చు.

నైరుతిమూల మొత్తం స్థలానికంటే ఎత్తుగా వుండావలెను. నైరుతి ఎత్తువలన ఆదాయము పెంపే కాకుండా కార్యసిద్ది కలుగును.

నైరుతిమూల దక్షిణ ఆగ్నేయంగా గాని, పశ్చిమవాయవ్యంగా గాని కొంచెంకాకుండా పెంపులేకుండా, ఖచ్చితంగా మూలమట్టానికి (90 డిగ్రీలు) వుండవలెను.

దక్షిణ నైరుతి పెరుగుట వలన నైరుతి వీధిపోట్లవలన, అందు బావులు, నూతులు వుండి పల్లంగా వుండిన అందుగల స్ర్తీలు దీర్ఘవ్యాధిగ్రస్తులై యుండుట, అకాలమరణము, యాక్సిడెంట్లు, దుర్మరణము, ఆత్మహత్యలకు పాల్పడుటయో కాకుండా ఒక్కొక్కచోట హత్యచేయడటం, హత్యకు గురియగుట జరుగును. ఇందు స్ర్తీలు అగౌరవమైన పనులకు పాల్పడుదురు. జైలుశిక్షలుకూడా అనుభవించుదురు.

పశ్చిమనైరుతిలో పై దోషాలు వుండిన పురుషులు దాని దుష్పాలితాలను అనుభవించాల్సి వుండును.

నైరుతి బ్లాకు స్థలానికి సింహద్వారాము ఏదో ఒకవైపు రోడ్డుకు మాత్రమే వుంచుకొనవలెను.

ఈ బ్లాకు స్థలానికి, ఎటువైపు రోడ్డు అయితే ఎక్కువ రద్దీగా వుంటుందో అటువైపు సింహద్వారాముఉంచుకొనవలెను.

గృహమునకు, గృహవరణకు పశ్చిమవాయవ్యంలో గాని, దక్షిణ ఆగ్నేయంలో గాని ద్వారాలు వుండవలెను.

గృహమునకు, గృహవరణకు దక్షిణ, పశ్చిమ నైరుతిలలో ద్వారాలున్న అష్టకష్టాలతో, ప్రాణనష్టాలను సంభవిస్తూ అనారోగ్యంతో నికృష్టజీవితాన్ని అనుభవిస్తూ వుంటారు.

దక్షిణ, పశ్చిమాలలో గృహము ఫ్లోరింగ్ లెవెల్ కన్నా అరుగులు ఎత్తుగా వుండాలే కాని పల్లంగా వుండకూడదు.

దక్షిణం వాలువసారవలన స్ర్తీలు, పశ్చిమ వాలువసార వలన పురుషులు పక్షవాతం, బొల్లి, కుష్ఠు, కేన్సర్ వంటి భయంకరమైన జబ్బులకు గురై ఆర్ధికనష్టాలతో అవమానం పొందుతున్నారు.

తూర్పు ఈశాన్యం తగ్గి, పశ్చిమనైరుతిలో ద్వారాలు వున్న అందు పుత్రసంతతికి ప్రాణనష్టము వాటిల్లను.

గృహము ఉత్తరం హద్దుచేసి దక్షిణనైరుతిలో ద్వారమున్న అందుగల స్ర్తీలు సుఖము లేనివారై ఆత్మహత్యలు చేసుకొందురు.

గృహమునకు ఉత్తర ఈశాన్యం తగ్గిపోయి, తూర్పు హద్దుపై నిర్మించి, నైరుతిదోషాలున్న అందు పురుషసంతతి ఉండక దత్తు రావటమో ఇల్లరికపు అళ్ళుళ్ళకు ఆస్తి సంక్రమించడమో జరుగును. ఈ ఆస్తి స్ర్తీ ధనంగా మారును.

స్థలానికిగాని, ఇంటికిగాని నైరుతి స్థలం తెగిపోయిన యెడల బాగుండునని కొందరు శాస్ర్తవేత్తల అభిప్రాయము. కాని నైరుతి తెగిపోవటంగాని, లోపించుటగాని జరుగకూడదని నా అభిప్రాయము. ఈ విషయం గురించి ఈ పుస్తకంలో ప్రత్యేక అంశంగా వ్రాయటం జరిగింది.

ఈశాన్యంలో పొయ్యి వుండి నైరుతిద్వారాలు వుండి ఇతర ఏ విధంగానైనా నైరుతి భ్రష్టుపట్టినయెడల అందున్న  భార్యాభర్తలు అన్యోన్నత లేనివారై ఆత్మహత్యలు చేసికోవటం, భార్య – భర్తనుగాని, భర్త – భార్యనుగాని హత్య చేయటం జరుగును.

నైరుతిలో పల్లంగా గాని, బావిగాని వుండి ఆ స్థలంలో గృహము నిర్మింప తలపెట్టిన గృహయజమాని గృహము పూర్తికాక ముందుగాని గృహప్రవేశము జరిగిన కొన్నాళ్ళలోగాని మరణించును.

ఉత్తరం హద్దుచేసి, దక్షిణం ఖాళీ స్థలం వదలి నిర్మించ తలపెట్టిన గృహము పూర్తికాక పోవటమో, పూర్తి అయిన తరువాత యజమాని కాని యజమానురాలు గాని మరణించడం-ఆర్థకనష్టాలు కలుగుటయో కాకుండా గృహము అమ్ముకొనుటకూడా జరుగును.

నైరుతిభాగంలో ఎతైన అరుగులు, చావుడిలు నిర్మించడం, బరువులు వేయటం వలన ఆర్థికాదాయం కలుగును.

 వంటగదిని ఆగ్నేయ, వాయవ్య గదులలో ఏర్పాటు చేసికొనవచ్చును.

గృహములోని వాడుకనీరు, వర్షపునీరు దక్షిణాగ్నేయం గుండా గాని, పశ్చిమవాయవ్యం గుండా గాని పోవలెను. ”డ్రైనేజి నిర్మాణాలు” అన్న అంశంలో ఆ విషయం గురించి వివరంగా తెలుపబడింది.

దక్షిణ, పశ్చిమం రోడ్లు కలియు నైరుతిమూలను గుండ్రంగా చేయుట, క్రాస్ గా కట్ చేయుటకు అలవాటుపడిననారు. అటువంటివి ఏమీ చేయక నైరుతిని కోణంగా వుంచండి. తప్పనిసరి పరిస్ధితులలో ఆ విధంగా చేయాల్సివస్తే క్రాస్ గా కాకుండా గుండ్రంగా చేయాలి.

నైరుతిగది వైశాల్యము, ఈశాన్యంగది వైశాల్యం కన్నా ఎక్కువగా వుండాలి.

దక్షిణ, పశ్చిమ, నైరుతి స్థలాలను ఇంటికి ఆనుకొని వున్నవి గాని, దూరంగా వున్నవిగాని ఎట్టి పరిస్థితులోను కొనగూడదు.

గృహనికి నైరుతిమూల ఎదేని నిర్మాణము చేయతలపెట్టినచో నిర్మాణము ఆగకుండా పని జరగాలి. ఒకవేళ నిర్మాణము ఆగిన యెడల కట్టుట కష్టమే కాకుండా ఆర్థిక, ప్రాణనష్టాలు సంభవించును. కావున గృహనిర్మాణానికి సంబంధించిన అన్ని వస్తువులను సమాకూర్చుకొని నిర్మాణము మొదలుపెట్టాలి.

గృహమునకు దక్షిణ, ప‌శ్చిమ‌, నైరుతుల‌లో ఏవేని నిర్మాణాలు చేయ‌త‌ల‌పెట్టిన ఆ నిర్మాణాల ప్లోరింగ్ లెవెల్ లోనూ, పైక‌ప్పు లెవెల్ లోనూ ప‌ల్లంగా ఉండ‌కూడ‌దు. ఇది ముఖ్య నియ‌మం.

నైరుతి గ‌దిని ప‌డ‌క గ‌దిగా గాని, బ‌రువులు వేయుట‌కు గాని ఉప‌యోగించాలి. నైరుతి గ‌దిలో, నైరుతి మూల డ‌బ్బు ఉంచుకోను బీరువాను ఉత్త‌ర‌, తూర్పుల‌కు ఏదో ఒక వైపున‌కు అభిముఖంగా ఉంచ‌వ‌లెను.

ద‌క్షిణ‌, ప‌శ్చిమాల‌యందు త‌క్కువ ఖాళీ స్థలం ఉంచి ఉత్త‌ర‌, తూర్పు వైపు ఎక్కువ స్థ‌లం ఉంచి ఈశాన్యాల‌ను పెంచి, ఈశాన్యంలో నుయ్యి త‌వ్వించి అందు శాస్త్ర బ‌ద్ధంగా గృహ‌ము నిర్మించిన‌, అందుగ‌ల‌వారు స్థిర‌, చ‌రాస్థులు క‌లిగి, పేరు ప్ర‌తిష్ట‌లు గ‌లవారై ఉంటారు.

వాస్తుదోషాల‌న్న నైరుతి బ్లాకు కొన్ని చోట్ల గొప్ప‌గా రాణిస్తుంది. నైరుతి బ్లాకు ప‌క్క‌న గ‌ల స్థ‌లాల‌కు తూర్పు, ఉత్త‌ర వీధులు ఈశాన్యం తెంపుతూ న‌డ‌క‌సాగిన‌ప్పుడుగాని, ఈశాన్యం, ఆగ్నేయం, వాయ‌వ్యం బ్లాకుల‌కు ఈశాన్యం భ్ర‌ష్టుప‌ట్ట‌డం వ‌ల్ల‌గాని, నైరుతి బ్లాకుకు దోషాలున్నా రాణిస్తుంది. అయితే ఈ విధ‌మైన స్థ‌లంలో నివ‌సించువారు ఆర్థికంగా పేరు ప్ర‌తిష్ట‌ల‌తో బాగుందురేగాని, ఆ స్థ‌లంలోగ‌ల ఇత‌ర దోషాలు అనుభ‌వించ‌క త‌ప్ప‌దు

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.