ధనలక్ష్మి ఇంట్లో స్థిరనివాసం ఉండాలంటే ఇంట్లో ఉండకూడని వస్తువులు ఎంటో తెలుసుకొవాల్లనుకుంటున్నారా

Dhanalakshmi maathaధనలక్ష్మీదేవి ఇంట్లో స్థిరనివాసం ఉండాలంటే ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకూడదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉండకూడదో తెలుసుకుందాం…

పావురాలు శాంతికి చిహ్నం అంటారు కానీ పావురాలు ఇంట్లో గూడు పెట్టుకుంటే మాత్రం లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. కాబట్టి ఇంట్లో మీకు తెలియకుండా పావురాలు గూడు కట్టుకుంటే వెంటనే వాటిని తొలగించండి.
తేనెని ఔషధంగానూ, పూజా కార్యక్రమాలలో వినియోగిస్తాము. ఇంటి ఆవరణలో ఉన్న చెట్లపై తేనెపట్టు ఉంటే వెంటనే తొలగించండి. ఇది లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది.

పాడుపడిన ఇంట్లోనూ, వినియోగించని ప్రదేశాలు, కిచెన్, వాష్ రూమ్స్ మొదలైన ప్రదేశాలలో సాలె పురుగులు గూళ్ళు ఏర్పరచుకుంటాయి. కానీ ఇది జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్ధిక సమస్యలకు సంకేతం అని పండితులు చెబుతున్నారు. అందుకే వెంటనే మీ ఇంట్లో సాలె గూళ్ళను తొలగించండి.
పగిలిపోయిన అద్దాలు దారిద్ర్యాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి అలాగే నెగటివ్ ఎనర్జీని కూడా అందుకే ఇంట్లో పగిలిపోయిన అద్దం ఉండకూడదు. ఒకవేళ ఉంటే వెంటనే బయట పారేయండి.

పాడుబడిన ఇంట్లో గబ్బిలాలు స్థిరనివాసం ఏర్పరచుకుంటాయి. గబ్బిలాలు అనారోగ్యానికి, పేదరికం, మరణానికి సంకేతంగా భారతీయులు విశ్వసిస్తారు. గబ్బిలాలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతంలో మీరు కనుక ఉంటే సూర్యాస్తమయ సమయంలో మీ ఇంటి తలుపులు, కిటికీలు తప్పకుండా మూసేయాలి.
ఇంట్లో గోడల పగుళ్ళు, రంగు వెలసిపోవడం చూడడానికే కాకుండా దురదృష్టానికి కూడా సంకేతాలు. కాబట్టి ఇంట్లో గోడపగుళ్ళు కనిపించినట్లయితే వెంటనే వాటిని పూడ్చండి, రంగు వేసుకోవాలి.

సాధారణంగా ఇంట్లో నీళ్ళ ట్యాప్స్ లీక్ అవుతూ ఉంటాయి. ఇంట్లో ట్యాప్స్ లీక్ అవుతుంటే వెంటనే రిపేర్ చేయించండి. ఎందుకంటే అవి ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీస్, అదృష్టం కూడా బయటికి వెళ్ళిపోతాయి.

చాలామంది ఇంట్లోని పాతవస్తువులను ఇంటిపై (టెర్రస్)పై పడేస్తుంటారు. ఇలా పాత వస్తువులను పడేయడం వల్ల దురదృష్టం వెన్నాడుతుంది, పేదరికం పీడిస్తుంది. కాబట్టి వెంటనే ఇంటిపై ఉన్న పాతవస్తువులను బయట పడేయండి.

ఇంట్లో దేవుడికి సమర్పించిన పువ్వులు, అలంకరణకి వాడే పువ్వులు వాడిపోయిన వెంటనే తొలగించాలి ఎందుకంటే ఇవి దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తాయి కాబట్టి.
వాడిపోయిన ఆకులు ఇంటి ఆవరణలో ఎన్నడూ ఉండకూడదు. అవి నెగటివ్ ఏనార్జీస్ ని ఆకర్షిస్తాయి, ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

Leave a Reply