అధిక మాసం ఎందుకు?
భూమికి – సూర్యుడి చుట్టూ తిరగడానికి 365+ రోజుల సమయం పడుతుంది. సూర్య సిద్ధాంతపరంగా సరిగ్గా చెప్పాలంటే 365.258756 (365 రోజుల 6 గంటల 12 నిమిషాల 36+ సెకండ్లు). ఇది నాక్షత్రిక గణనము (Sidereal duration). నేటి ఆధునిక శాస్త్రీయ లెక్కలను బట్టి 365.256362 (365 రోజుల 6 గంటల 9 నిమిషాల 8+ సెకండ్లు) సమయం పడుతుంది. ఇది కూడా నాక్షత్రికమే. సూర్య సిద్ధాంత పరంగా మరియూ నేటి ఆధునిక శాస్త్రపరంగాగానీ, రమారమిగా 29.53 …