Tag Archives: hindutva

చూడామణి యోగం – సోమవారం – చంద్ర గ్రహణం – రాఖి పౌర్ణమి – 07-08-2017

Anudeep Sharma

Anudeep Sharma

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై

నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు

జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలాసేపు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.చంద్రగ్రహణమేర్పడే పరిస్థితిలో

భూమిపైనున్నవారికి చంద్రగ్రహణం కనబడితే, అదే సమయంలో చంద్రుడిపైనుండి వీక్షిస్తే? సూర్యగ్రహణం

కనబడుతుంది.సూర్యగ్రహణానికి చంద్ర గ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే, చంద్ర గ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్య

గ్రహణం నాడు, సూర్యుడు కనపడడు. ఇది చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్యలోనుంచి ప్రయాణిస్తున్నపుడు

ఏర్పడుతుంది.సూర్యగ్రహణం వలే కాకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించడం వలన కళ్ళకు ఎటువంటి హానీ జరగదు.రక్షణ కోసం

ఎటువంటి కళ్ళజోడు అవసరం లేదు. టెలిస్కోప్ కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే

దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే బైనాక్యులర్స్ను వాడితే చంద్ర గ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. చంద్ర

గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు

గిల్లుకోకూడదని, ఏమీ తినకూడదని పూర్వం నుండి భారతదేశంలో నమ్మకం ఉంది.

శ్లో:  రవి గ్రహస్సూర్యవారే సోమేగ్రహస్తదా!

చూడామణి ఖ్యాతః తత్రదత్తమనంతకం

వారేష్వన్యేషు యత్పుణ్యం గ్రహణే చంద్ర సూర్యయో:!

తత్పుణ్యమ్ కోటి యోగే చూడా మణౌ స్మృతం !!        — వ్యాసోక్తి – నిర్ణయసిందు

      ఆదివారం సూర్యగ్రహణం, సోమవారం చంద్ర గ్రహణం వచ్చుటను“ చూడామణి యోగం ” అంటారు.

ఆ సమయంలో చేయబడిన దానం వలన అనంతఫలం వస్తుంది.

ఇతర వారాలోల సూర్య , చంద్ర గ్రహణాలు వస్తే చేసేదానం కంటే ఈ చూడామణి యోగం వచ్చునప్పుడు చేసేదానం  కోటి

రెట్లు అధిక ఫలమిస్తుంది.

07.08.2017 రోజున ఇదే “చూడామణియోగం” వస్తుంది

స్పర్షకాలం – రాత్రి. 10:56

మధ్యకాలం – రాత్రి. 11:54

మోక్షకాలం – రాత్రి.12:52

ఆద్యంతపుణ్యకాలం -01:56.

శ్రవణానక్షత్రం. మకరాశి వారు తగుజాగ్రత్తలు తీసుకోగలరూ.

ఛంద్ర గ్రహణ విషేషాలు,దానాల కొరకు మరియు ఇతర విషయాల కొరకు సంప్రదించండి 9848272621.

శ్రావణమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున వచ్చే పవిత్ర పర్వదినాన్ని శ్రావణ పౌర్ణమి అంటారు. ఆ రోజు రాఖి పౌర్ణమి, జంధ్యాల

పౌర్ణమి, రక్షికా పూర్ణిమ, రఖ్రీ సాలునో, సారవీ పూర్ణిమ, నారికేళ పూర్ణిమ, నార్లీ పున్నమి ఇలా వివిధ పేర్లతో ఈ పండుగను

భారతదేశమంతా జరుపుకుంటారు. ఈ రాఖి పౌర్ణమిని మధ్యాహ్నం 1:10 (1:10 PM) నిమిషముల లొపల జరుపుకోవాలి.

కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ?

కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ.. కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ?
మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పనేలేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసివుండాలి. అప్పుడే అది అడ్డంగా … చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు.

Continue reading

వాస్తు ప్రకారం తులసీకోట ఏవైపు ఉండాలో తెలుసుకుందామా?

  1. tulasikotaతూర్పుదిశయందు తూర్పు ఆగ్నేయములోను ఉత్తరదిశయందు ఉత్తర వాయువ్యములోను తులసికోటను అరుగువేసి ఇంటినేల మట్టమునకంటె ఎత్తు తక్కువలో ఉండినట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు ఖాళీయుండునట్లుగా ఏర్పాటు చేసుకొనుట మంచిది.
  2. తులసికోటను ఈశాన్యములో ఎట్టి పరిస్థితులలో నిర్మించరాదు. దోషప్రదము.
  3. తులసిని కుండీలలో ఉంచి అట్టి కుండీలను ఈశాన్య దిశలో ఉంచిన దోషప్రదము.
  4. దక్షిణ ఆగ్నేయములోను, పడమర వాయువ్యములోను ఏర్పాటు చేసుకొనుట మంచిది.
  5. దక్షిణ నైరుతిలోను, పడమర నైరుతిలోను తులసికోట ఇంటినేల మట్టముకంటె ఎత్తుగా ఉండునట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు వీలుగానూ నిర్మాణం చేసుకొంటె మంచిది.
  6. తులసికోట గృహమునకుగాని ప్రహారీగోడలకుగాని అంటకుండునట్లు నిర్మించుకోవాలి.తులసి ఆకుల్ని చెవి వెనుకన పెట్టుకుంటూ ఉంటారు.. మరీ మీరేప్పుడన్నా గమనించారా!! గుడిలో పూజారులు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. మరైతే ఎందుకు అలా పెట్టుకుంటారో తెలుసా?? ఆడవారి కైతే జడ ఉంటుంది కాబట్టి జడలో పెట్టుకుంటారు కానీ మగవారు తలో పెట్టుకోలేరు కనుక చేవ్విలో పెట్టుకుంటారు అని మనలో చాలా మంది అనుకుంటారు.. అవునా!! కాని దాని వెనుక ఉన్న scientific reason ఏంటో తెలుసుకుందామా!

    మన శరీరంలో ఉష్ణాన్ని త్రీవరంగా గ్రహించు గుణం చెవుల వెనుక భాగానికి ఉంది. అయితే తులసి లోని ఔషదియ గుణం మనందరికీ తెలిసిందే!! కాబట్టి తులసి ని చెవి వెనుక భాగంలో పెట్టడం వల్ల అక్కడి చర్మం తులసిలో ఔషద గుణాలను గ్రహించుకుంటుంది. అంతే కాదండీ శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేసే ప్రభావం ఉన్న adaptogen గా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయి. అందుకనే తులసిని చెవి వెనుక భాగంలో పెట్టుకుంటారు.

Continue reading

శ్రీ ఆంజనేయ స్వామిని శనివారం పూజిస్తే ?

You can pray to hanuman on saturday, hanuman pooja saturday,important days for hanuman, hanuman pooja benefit saturday

శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే శనివారం శ్రేష్టమైనది.
“సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః”

అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా కాని,  కార్తీక శుద్ధ ద్వాదశినాడు కాని శనివార వ్రతం చేయాలి.

Continue reading

Krishna చరిత్ర Christ చరిత్ర గ అయిందో ?

మహారాష్ట్ర దేశంలో కృష్ణ శబ్దం కిష్టో , కిష్టు అని పరివర్తనం చెందింది. కిష్టు శబ్దానికి క్రైస్తు శబ్దానికి సంబధం శ్రవణం గోచరంగా ఉంది. కృష్ణ భగవానుడు పాదాంగుష్టంలో సిలీ ముఖం గుచ్చుకోగా దేహత్యాగం చేసాడు. Christ ను సిలువ మీద దేహత్యాగం చేసినాడు. ఇది పురాణాలలోని krishna కథే కావచ్చు. ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాలను చదివి అర్ధాన్ని సరిగా గ్రహించాలేనట్లుంది. Jacob అన్న పదం తీసుకుందాం …అది Hibroo పదం. Yacob అని ఆ పదం మారింది. Joseph అనే పదం Continue reading