మన దైనందిన కార్యక్రమములో ఎన్నో విజ్ఞాలు కలుగుతుంటాయి. పని పూర్తయిపోతుంది అని అనిపించినప్పటికి కొన్ని సార్లు ఆ పని (కార్యం) కాదు. లేదా మనం సంకల్పించుకున్న పని కొన్ని సార్లు జరుగుతుందా లేదా అనే సంధర్భం కూడా జరుగుతుండవచ్చు.అలాంటి సమయములో శీగ్రంగా విజ్ఞ బాధలు తొలుగుట కొరకు విజ్ఞాలకు అధిపతి అయినటువంటి విజ్ఞేశ్వరుడి ఒక స్తోత్రం కలదు అదియే సంకట నాశన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే త్రి సంధ్యాలలో అనగా సూర్యోదయ,మధ్యాహ్న సూర్యాస్తమాయ సమయములో చదివిన విన్న కార్య సిద్ధి కలుగ గలదు.
మీరు అనుకున్న కార్యమే కాకుండా విద్య,ధనం మరియు సంతాన ప్రయత్నములు చేసే వారికి ఈ స్తోత్రం కచ్చితంగా ఫలిస్తుంది. ఆరు నెలలో ఫలించని కోరిక అనేది ఉండదు. జై బోలో సంకట నాశ గణపతి మహారాజ కి జై . పూర్తి నమ్మకం తో చేయండి. స్వామి అనుగ్రహాన్ని పొందండి. మీకు సందేహ నివృత్తికి సంప్రదించండి.
స్తోత్రం:
నారద ఉవాచ :
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః .
ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.