- తూర్పుదిశయందు తూర్పు ఆగ్నేయములోను ఉత్తరదిశయందు ఉత్తర వాయువ్యములోను తులసికోటను అరుగువేసి ఇంటినేల మట్టమునకంటె ఎత్తు తక్కువలో ఉండినట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు ఖాళీయుండునట్లుగా ఏర్పాటు చేసుకొనుట మంచిది.
- తులసికోటను ఈశాన్యములో ఎట్టి పరిస్థితులలో నిర్మించరాదు. దోషప్రదము.
- తులసిని కుండీలలో ఉంచి అట్టి కుండీలను ఈశాన్య దిశలో ఉంచిన దోషప్రదము.
- దక్షిణ ఆగ్నేయములోను, పడమర వాయువ్యములోను ఏర్పాటు చేసుకొనుట మంచిది.
- దక్షిణ నైరుతిలోను, పడమర నైరుతిలోను తులసికోట ఇంటినేల మట్టముకంటె ఎత్తుగా ఉండునట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు వీలుగానూ నిర్మాణం చేసుకొంటె మంచిది.
- తులసికోట గృహమునకుగాని ప్రహారీగోడలకుగాని అంటకుండునట్లు నిర్మించుకోవాలి.తులసి ఆకుల్ని చెవి వెనుకన పెట్టుకుంటూ ఉంటారు.. మరీ మీరేప్పుడన్నా గమనించారా!! గుడిలో పూజారులు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. మరైతే ఎందుకు అలా పెట్టుకుంటారో తెలుసా?? ఆడవారి కైతే జడ ఉంటుంది కాబట్టి జడలో పెట్టుకుంటారు కానీ మగవారు తలో పెట్టుకోలేరు కనుక చేవ్విలో పెట్టుకుంటారు అని మనలో చాలా మంది అనుకుంటారు.. అవునా!! కాని దాని వెనుక ఉన్న scientific reason ఏంటో తెలుసుకుందామా!
మన శరీరంలో ఉష్ణాన్ని త్రీవరంగా గ్రహించు గుణం చెవుల వెనుక భాగానికి ఉంది. అయితే తులసి లోని ఔషదియ గుణం మనందరికీ తెలిసిందే!! కాబట్టి తులసి ని చెవి వెనుక భాగంలో పెట్టడం వల్ల అక్కడి చర్మం తులసిలో ఔషద గుణాలను గ్రహించుకుంటుంది. అంతే కాదండీ శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేసే ప్రభావం ఉన్న adaptogen గా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయి. అందుకనే తులసిని చెవి వెనుక భాగంలో పెట్టుకుంటారు.