మహాశివరాత్రి ఒక హిందువుల పండుగ. దేవుడు శివుడుని భక్తితో కొలుస్తూ ఏటా జరుపుకుంటారు. ఇది శివ, దేవత పార్వతి వివాహం జరిగింది రోజు. మహా శివరాత్రి పండుగను కూడా ప్రముఖంగా ‘శివరాత్రి’ గా పిలుస్తారు. (అంతేకాక శివరాత్రి, సివరాత్రి, శైవరాతిరి, శైవవరాత్రి, మరియు శివరాతిరి అని కూడా పలుకుతారు) మరికొందరు ‘శివుడి యొక్క గ్రేట్ నైట్’, అని లేదా శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు.
మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.
అభిషేకములు మరియు పూజలు జపాల కొరకు సంప్రదించండి: అనుదీప్ శర్మ: 9848272621
భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.
భక్తులు ఈరోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులూ చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే “భక్తవశంకర” అన్నారు.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచు కుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకున్నా, అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆవిధంగా ముక్తి పొందుతాడు. అదీ సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది.
అభిషేకములు మరియు పూజలు జపాల కొరకు సంప్రదించండి: అనుదీప్ శర్మ: 9848272621
శివరాత్రి రోజున శివునికి అభిషేకం ఎలా చేయాలి!?
శ్లో|| పుర్రె చేసిన పుణ్యమేమో! పంచ చేరి నీకు కంచమాయే !
వల్లకాటి భాగ్యమేమో ! తనకు తానే నీకు మంచమాయే !
అన్నట్లు శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు.
మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతో శివునిని అభిషేకిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో చూద్దాం.. కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పలురకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది. వెండిధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది.
అభిషేకములు మరియు పూజలు జపాల కొరకు సంప్రదించండి: అనుదీప్ శర్మ: 9848272621
నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధన, భార్యా, పుత్రలాభం, పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉప్పుతో అభిషేకించితే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లాభిస్తాయి. బెల్లపు పలుకులతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో జయము కలుగుతుంది.
వెదరు చిగుళ్ళతో అభిషేకం చేస్తే వంశవృద్ధి, పాలాభిషేకం వలన కీర్తి, సిరి, సుఖములు కలుగును. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో చేస్తే దారిద్రనాశనమవుతుంది.
ఇక పలురకాల పండ్లతో చేసే అభిషేకం జయాన్నిస్తుంది. ఉసిరికాయలతో చేస్తే మోక్షము, బంగారుపొడితే అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది. అష్టదాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి, మణులతో, వాటి పొడులతో అభిషేకించితే అహంకారం తొలగిపోతుంది. పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు లభిస్తాయి. ఆవునెయ్యి, ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయుర్ వృద్ధి కలుగుతుంది.
అతడికి తను అడవిలో చిక్కుకొన్న రోజున చేసుకున్న పుణ్యం తెలిసి వచ్చింది. ఆ బిల్వ వృక్షం కింద ఒక లింగం ఉంది. ఆ వేటగాడు తన కన్నీరుతో స్వామికి తెలియకనే అభిషేకం చేసాడు. బిల్వపత్రాలను వదిలి పూజ చేసాడు. అన్నపానీయాలు లేక ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి మహాశివ రాత్రి. మర్నాడు వేరొకరికి ఆహరం సమర్పించి తను సేవించాడు.
శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు – “మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును. ఉపవాసము ఉండి, రాత్రి నాల్గుఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!”
ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. నాల్గుఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.
భారత దేశంలో 12 చోట్ల ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిసాయి. లింగం జ్యోతిరూపంలో వెలిసిన క్షేత్రాలివి.
రామనాథ ఆలయం, రామేశ్వరం, తమిళనాడు
మల్లికార్జునేశ్వర ఆలయం, కృష్ణా నది తీరంలో, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
భీమశంకరం, డాకిని, పూణ దగ్గర, మహారాష్ట్ర
త్ర్యంబకేశ్వరాలయం, గోదావరి నదీ తీరంలో, నాసిక్ దగ్గర, మహారాష్ట్ర
గుస్మేశ్వర ఆలయం, ఔరంగాబాద్ దగ్గర, మహారాష్ట్ర
ఓంకారేశ్వరాలయం, నర్మదా నదీతీరంలో, అమలేశ్వర్, మధ్యప్రదేశ్
సోమనాథ్ ఆలయం, సోమనాథ్, గుజరాత్
నాగనాథ ఆలయం, దారుకావన, ద్వారక దగ్గర, గుజరాత్
మహాకాళేశ్వర ఆలయము, శిప్రా నదీ తీరంలో, ఉజ్జయిని
కేదరేశ్వరాలయం, కేదారనాథ్, ఉత్తరాచల్
కాశి విశ్వనాథుని ఆలయం, వారాణసి, ఉత్తరప్రదేశ్
వైద్యనాధుని ఆలయం, జైసిద్ దగ్గర, బీహార్
అథర్వణ వేద సంహితలో యుప స్తంభమునకు పూజించుతూ చేసే స్తుతిలో మొట్ట మొదటి సారిగా శివ లింగం చెప్పబడింది అంటారు. ఈ యుప స్తంభం/స్కంభం ఆద్యంతరహితమైనది. పరమాత్మ రూపమైనది. అట్టి లింగోద్భవం జరిగిన రోజు శివ రాత్రి.
స్కంద పురాణం ప్రకారం ౪ రకాల శివ రాత్రులు. ప్రతీ రోజు నిత్య శివరాత్రి. ప్రతీ నెల కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి, మాస శివరాత్రి. మాఘ మాసం లో ప్రథమ తిథి నుండి చతుర్దశి రాత్రి వరకు పూజలు చేసి, రాత్రి చేసేది మాఘ ప్రధమాది శివరాత్రి. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి చేసేది మహా శివరాత్రి..
అభిషేకములు మరియు పూజలు జపాల కొరకు సంప్రదించండి: అనుదీప్ శర్మ: 9848272621
సైంటిఫిక్ రీజన్:మన పూర్వీకులు ఏది చేసినా ఒక పరమార్ధం వుంటుంది.శివరాత్రి ప్రతి ఏటా మాఘ మాసం లో 14రోజు వస్తుంది.ఈ రోజు గ్రహాల కదలిక అంటే planetary movement వల్ల మానవ శరీరంలో శక్తి ప్రసరిస్తుందట, అందుకని మానవులని మేల్కొల్పి ఆ శక్తిని గ్రహించేందుకు వీలుగా జాగరణని ఏర్పాటు చేసారని తెలుస్తోంది.
కాబట్టి ఈసారి శివరాత్రి కి అందరితోపాటూ నేనూ, అని కాకుండా….ఈ రోజు యొక్క ప్రత్యేకతని తెలుసుకుని జరుపుకుందాం.ఆధ్యాత్మికంగానూ,వైజ్ఞానికంగాను శివరాత్రి పూజ,ఉపవాసం ఇంకా జాగరణ ఎంత మేలో తెలిసింది కదా.ఏ కారణం లేకుండా మన పెద్దలు పండుగలను జరపరని మరొక్కసారి తెలిసింది.
అభిషేకములు మరియు పూజలు జపాల కొరకు సంప్రదించండి: అనుదీప్ శర్మ: 9848272621