పాలను ఆశించి గోవును పోషిస్తాము ,
గోవు నుంచి మనకు పాలు వస్తాయి
అంతే కాదుః పేడ కూడా వస్తుంది ,
పాలు ఇంట్లోకి తెచ్చుకుంటాం ,
పేడని .ఇంటికి దూరంగా విసిరేస్తాం ,
ఆవు నుండి పాలు మాత్రమే రావాలి –
పేడ రాకూడదు అంటే వీలు కాదు ,
కర్మలు కూడా ఇలాగే ఉంటాయి …..
ఏ కర్మ చేసినా అది పూర్ణంగా అర్థవంతంగా
ఉంటుందని చెప్పలేము ,
కొంత అభ్యంతరంగా కూడా ఉంటుంది .
సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి .
ఏ. సంబంధం లేకుండా ఎవరితోను సంబంధం
లేకుండా జీవించడం సాధ్యపడదు .
కాని సంబంధాలలో కేవలం సంతోషమే
ఉంటుందని చెప్పలేము ,
విషాదం కూడా కలిసే ఉంటుంది ,
మనం ఎవరితో కలిసి జీవించినా . వారు –
తల్లిదండ్రులు కావచ్చు , అన్నదమ్ములు
కావచ్చు , భార్యాభర్తలు కావచ్చు
స్నేహితులు కావచ్చు , బంధువులు కావచ్చు ,
వారిలో అన్నీ మనకు నచ్చిన గుణాలే
ఉంటాయని చెప్పలేము .
మనకు నచ్చనివి , వారు మెచ్చేవి కూడా
ఉంటాయి …. అలాంటివి ప్రేమకి సౌఖ్యానికి
ప్రతిబంధకాలే కావచ్చు , కాని అవి లేకుండా
సంబంధాలు లేవు గులాబీలమధ్యా ముళ్ళు
తప్పనట్లు సంబంధాలలో ఈ విధమైన
సంఘర్షణలు తప్పవు ..
భోజనం చేయాలి ఆకును పడేయాలి .
కాని. ఆకు లేకుంటే వడ్డించటమే జరగదు —
ఆకలి తీరదు , ఆకలి అన్నంతోనే తీరుతుంది
అన్నం ఆరగించినంత. వరకు ఆకును
ఆదరిస్తూనే పోవాలి ,
పడేసేదే కదా అనుకోవచ్చు , కడుపులో
అన్నం పడే ఆకు మన ముందే ఉండాలి ,…
ఈ. ప్రపంచంలో ఏది అవసరం లేని క్షణం
ఒకటి రావచ్చు కాని అవసరాలలో
ఆవశ్యంగా తొంగిచూసే అనవసరాలనుకూడా
పెద్ద మనసుతో అంగీకరించే పెంచుకుంటేనే
అభివృద్ధిని సాధించటం మనిషికి
సాధ్యపడుతుంది