చంద్ర గ్రహణం ఎప్పుడు కలదు ?
ఆషాఢ శుద్ధ పూర్ణిమ అనగా తేది :16 – 07 – 2019
చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుందా ?
ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగా తేది : 16 – 07 – 2019 , మంగళ వారము రోజు ప్రారంభమగు చంద్ర గ్రహణము…. ఈ గ్రహణము మన దేశములో కనిపిస్తుంది.కావున ఇట్టి చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుంది.గ్రహణ నియమాలను తప్పక పాటించాల
గ్రహణ సమయ వివరాలు :
? గ్రహణ స్పర్శ కాలము :
తేది : 16 – 07 – 2018 , మంగళ వారము , రాత్రి 01:34 ని॥లకు
? *గ్రహణ మధ్య కాలము :*
తెల్లవారు జామున 03:04 ని॥లకు
? *గ్రహణ మోక్ష కాలము :*
ఉదయం 04:33 ని॥లకు
గ్రహణ నియమాలు ఏ సమయం నుండి పాటించాలి ?
గ్రహణ వేధారంభ సమయం నుండి గ్రహణ మోక్ష సమయం దాకా గ్రహణ నియమాలను పాటించాలి.గ్రహణ వేధారంభం తేది : 16 – 07 – 2019 , మంగళ వారము మధ్యాహ్నము 4:34 ని॥ల నుండి గ్రహణ నియమాలను పాటించాలి.
వయస్సు రీత్యా , వ్యాధి తీవ్రత రీత్యా వృద్ధులు , ఆరోగ్య రీత్యా గర్భిణీ స్త్రీలు అన్ని గంటల పాటు గ్రహణ నియమాలను పాటించలేని , గత్యంతరము లేని స్థితి ఉన్నప్పుడు మాత్రము గ్రహణ స్పర్శ కాలము నుండి గ్రహణ మోక్ష కాలము వరకైనా గ్రహణ నియమాలను పాటించాలి.
గ్రహణాన్ని ఎవరు వీక్షించకూడదు ?
ధనుస్సు రాశి , మకర రాశి వారు
చేయవలసిన దానాలు :
ఒక నూతన ఇత్తడి పాత్రలో నిండుగా ఆవు నెయ్యి పోసి అందులో బంగారం చూరు , వెండి చంద్ర ప్రతిమ , వెండి నాగ విగ్రహము , ఒక మంచి ముత్యం వేసి దానమివ్వాలి.
తప్పకుండా గ్రహణ హోమము చేయించాలి.తెల్లటి వస్త్రము మరియు బియ్యం కూడా దానమివ్వాలి.
గ్రహణ మోక్ష కాలము పూర్తయిన తర్వాత స్నానమాచరించి , సద్భ్రాహ్మణుడికి దక్షిణ తాంబూల సమేతంగా , సంకల్పయుక్తంగా పై సూచించిన దానాలు ఇవ్వాలి.
అపాత్ర దానం శూన్య ఫలాన్నిస్తుందని గరుణ పురాణంలో పేర్కొనబడినది.కావున ఎవరికిపడితే వారికి కాకుండా మీ మీ ప్రాంతాలలో ఉన్న సదాచార సంపన్నులు , నిష్ఠా గరిష్ఠులు , నిత్య జప-తప-హోమ యాగ క్రతువులు చేయువారు , నిత్య దేవతార్చన చేయువారు , వేదాధ్యయనము చేసిన వేద మూర్తులైన బ్రాహ్మణ పండితులకు దానమీయవలెను.అప్పుడే దాన ఫలితము లభించును.
గ్రహణ సమయంలో నదీ స్నానం చేసి , నదీ తీరములో అనుష్ఠానము చేసుకోవడం సంపూర్ణ ఫలప్రదము,పుణ్య ప్రదము.