ఒక యోగి ఆత్మకథ

IMG_0878(2)ఒక యోగి ఆత్మ కథ నన్ను బాగా ఆకర్షించిన కొన్ని విలువైన ప్రచురణలొ ఇది మొదటిది.ఎదో మనకు తెలువనిది ఈ ప్రపంచం లొ దాగి ఉంది అని చెప్పె ఈ ప్రచురణ నాకు చాల ఇస్టం కుడా. వీలుంటే చనిపొయే లొపు ఒక్క సారి ఈ పుస్తకాన్ని చదవండి.

కృతికర్త: పరమహంస యోగానంద
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విడుదల: 1946

ఒక యోగి ఆత్మకథ ప్రముఖ భారతీయ యోగి పరమహంస యోగానంద రచించిన సంచలన ఆధ్యాత్మిక రచన. ఇందులో ఆయన ఆత్మకథను పొందుపరిచాడు. ఈ పుస్తకం ఎంతో మంది విదేశీయులకు యోగాను, ధ్యానాన్ని పరిచయం చేసింది. ఇప్పటి దాకా దాదాపు 25 భాషల్లోకి అనువదించబడింది. ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ఈ పుస్తకం ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

ఈ పుస్తకంలో ప్రధానంగా యోగానంద తన గురువు కోసం అన్వేషణ, ఆ ప్రయత్నంలో భాగంగా ఆయనకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలు, అప్పట్లో పేరు గాంచిన ఆధ్యాత్మిక వేత్తలైన థెరెసా న్యూమన్, శ్రీ ఆనందమయీ మా, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీతయైన సి.వి. రామన్, అమెరికాకు చెందిన శాస్త్రజ్ఞుడు లూథర్ బర్బాంక్ మొదలైన వారితో గడిపిన ముఖ్యమైన ఘట్టాలు నిక్షిప్తం చేయబడ్డాయి. ఆయన గురువైన యుక్తేశ్వర్ గిరి తో అనుబంధం, గురు శిష్యుల మధ్య సంబంధాల గురించి కూడా వివరాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఆయన ఈ పుస్తకాన్ని వీరికే అంకితం చేశాడు.

యోగానంద పిన్న వయసులోనే భారతదేశంలోని గొప్ప యోగులను కలవడం తటస్థించింది. హైస్కూల్ విద్య పూర్తి కాకముందే ఆయన కనబరిచిన అనేక ఆధ్యాత్మిక శక్తులను, గురువు దగ్గర ఆయన శిక్షణ గురించిన విశేషాలు యోగానంద తమ్ముడైన సనంద లాల్ ఘోష్ రచించిన పుస్తకంలో సవివరంగా వివరించబడ్డాయి.

బాల్యంలోనే ఆధ్యాత్మికత వైపు మొగ్గు
ఆధ్యాత్మిక ప్రభావాలు, వారసత్వం
గురుశిష్య సంబంధాలు
క్రియాయోగం
click here to read online

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.