Month: January 2017

వైకుంఠ ఏకాదశి

పరమ పావనమైన ధనుర్మాస వేళలో వచ్చేటటువంటి దివ్యమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా వ్యవహరింపబడుతున్నది. ఈ పావనమైన ఏకాదశీ పర్వం ప్రతి మాసములోనూ సార్థకమైనప్పటికీ కూడా కొన్ని కొన్ని మాసాలలో ఒక ప్రత్యేకత దీనికి ఉన్నది