ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి ?

తిధుల ప్రాధాన్యత ఏమిటి ?
ఏ తిధి రోజున
ఏ దేవతను పూజ చేయాలి ?
తిధి వ్రతములు
చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి ?

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది.
అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని
పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.
తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.

పాడ్యమి :
అధిదేవత – అగ్ని.
వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.

విదియ :
అధిదేవత – అశ్విని దేవతలు.
వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.

తదియ :
అధిదేవత – గౌరీ దేవి.
వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.

చవితి:
అధిదేవత – వినాయకుడు.
వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట

పంచమి:
అధిదేవత – నాగ దేవత.
వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది.

షష్టి :
అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి.
వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి.

సప్తమి:
అధిదేవత – సూర్య భగవానుడు.
వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది.

అష్టమి:
అధిదేవత – అష్టమాత్రుకలు.
వ్రత ఫలం – దుర్గతి నాశనము.

నవమి:
అధిదేవత – దుర్గాదేవి.
వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది.

దశమి:
అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు.
వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి.

ఏకాదశి:
అధిదేవత – కుబేరుడు.
వ్రత ఫలం – ఐశ్వర్యము ప్రాప్తించును.

ద్వాదశి:
అధిదేవత – విష్ణువు.
వ్రత ఫలం – పుణ్య ఫల ప్రాప్తించును.

త్రయోదశి:
అధిదేవత – ధర్ముడు.
వ్రత ఫలం – మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.

చతుర్దశి:
అధిదేవత – రుద్ర.
వ్రత ఫలం – మ్రుత్యున్జయము, శుభప్రదం.

అమావాస్య:
అధిదేవతలు – పితృదేవతలు.
వ్రత ఫలం – సంతాన సౌఖ్యం.

పౌర్ణమి:
అధిదేవత – చంద్రుడు.
వ్రత ఫలం – ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.