వాస్తు

గృహ వాస్తు – పంచ భూతాల ప్రాముఖ్యత

మానవుని జీవనాన్ని శాసించేవి, సృష్టికి మూలమైనవి పంచ భూతాలు. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, గాలి.. వీటిని సక్రమంగా ఉపయోగించటం ద్వారానే మానవుడు తన ఆరోగ్యకరమైన జీవితానికి బంగారు బాటలు వేసుకుంటాడు. అలానే మనం ఒక స్ధలం కొన్నా, ఒక ఇల్లు కొన్నా సుఖమైన జీవితాన్ని ఆ ఇంట్లో సాగించాలంటే అవే పంచభూతాలు కొన్న ఆ ప్రదేశాలలో వాస్తు పరంగా ఉండి తీరాలి. అలా ఉంటేనే ఆ ప్రదేశాన్ని కచ్చితమైన వాస్తుతో ఉన్న స్థలం లేదా ఇల్లు అంటాం. అలాంటి చోట శుభకరమైన ఫలితాలు ఉంటాయి.

వాస్తు ప్రకారం తులసీకోట ఏవైపు ఉండాలో తెలుసుకుందామా?

తూర్పుదిశయందు తూర్పు ఆగ్నేయములోను ఉత్తరదిశయందు ఉత్తర వాయువ్యములోను తులసికోటను అరుగువేసి ఇంటినేల మట్టమునకంటె ఎత్తు తక్కువలో ఉండినట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు ఖాళీయుండునట్లుగా ఏర్పాటు చేసుకొనుట మంచిది. తులసికోటను ఈశాన్యములో ఎట్టి పరిస్థితులలో నిర్మించరాదు. దోషప్రదము. తులసిని కుండీలలో ఉంచి అట్టి కుండీలను ఈశాన్య దిశలో ఉంచిన దోషప్రదము. దక్షిణ ఆగ్నేయములోను, పడమర వాయువ్యములోను ఏర్పాటు చేసుకొనుట మంచిది. దక్షిణ నైరుతిలోను, పడమర నైరుతిలోను తులసికోట ఇంటినేల మట్టముకంటె ఎత్తుగా ఉండునట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు వీలుగానూ …

వాస్తు ప్రకారం తులసీకోట ఏవైపు ఉండాలో తెలుసుకుందామా? Read More »