Tag Archives: పూజలు

ఏ వారం.. ఏ పూజ చేస్తే.. శుభము కలుగుతుంది?

Worship the god

కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.

ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

Read MOre

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి ?

తిధుల ప్రాధాన్యత ఏమిటి ?
ఏ తిధి రోజున
ఏ దేవతను పూజ చేయాలి ?
తిధి వ్రతములు
చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి ?

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది.
అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని
పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.
తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.

పాడ్యమి :
అధిదేవత – అగ్ని.
వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.

విదియ :
అధిదేవత – అశ్విని దేవతలు.
వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.

తదియ :
అధిదేవత – గౌరీ దేవి.
వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.

Continue reading

చంద్ర గ్రహణం నియమ నిబంధనలు గ్రహణ దోష నివారణ పూజలు జపాలు

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం:

చంద్ర గ్రహణం నియమ నిబంధనలు గ్రహణ దోష నివారణ పూజలు జపాలు గురించి క్లుప్తంగా చదవండి.

చంద్ర గ్రహణం : ఖగోళ పరంగా చంద్ర గ్రహణం అనేదిసూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు.

 

సూర్య, చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని, కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ, కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు.

జనవరి 31, 2018 న చంద్రగ్రహణం

ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక, సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించనున్నది.

భారత కాలమానం ప్రకారం Continue reading