May monthly horoscope – మే మాస ఫలితాలు

మేష రాశి:
ఒర్పు,తెలివి అన్ని చోట్ల ప్రదర్శించి సానుకుల ఫలితాలు అందుకుంటారు.దైనందిన ఫలితాలు ఆశవహంగా సాగుతాయి.ఆర్ధిక లావాదేవీలు బాగుంటాయి.ఆరొగ్య విషయంలో జాగ్రత్త అవసరం.కుజ గ్రహ అనుకూలతో చాల పనులు వివాదాలకు తావివ్వకుండ జరుగుతాయి.దుర్గారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు అనుభవించే అవకాశం.

వృషభ రాశి:

గ్రహచారం అనుకూలంగా ఉంది. పనులు వేగంగా సాగుతాయి. శారీరకంగా మానసికంగా ఒత్తిడి కి లోనై కొన్ని పనులు స్వతహాగా చెడిపేసుకునే అవకాశం ఉంటుంది.ప్రయాణాలు ,పుణ్య క్షేత్ర  దర్శనం చేయసుకొనే అవకాశం. అనవసర కాలక్షేపం వల్ల కొత్త చిక్కులు అసహనం ఏర్పడుతుంది. మౌన దీక్ష మితభాషణ సరస్వతి ఆరాధన వల్ల శ్రేయస్కరం.


మిథున రాశి:
శుభకార్య,పుణ్య కార్య ప్రయత్నాలలో అధిక ధన వ్యయం. పనులల్లో ఆలస్యం. శరీర గాయాలు అయ్యే అవకాశం. మోసపూరిత వాతావరణం ఉండే వాళ్ళతో చాలా జాగ్రత్త అవసరం. సొంతగా పనులు చూసుకోవడం వల్ల సమస్యలనుండి బయటపడే అవకాశముంది. ఉద్యోగ వ్యాపార విషయాలల్లో చాలా జాగ్రత. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటక రాశి:

ప్రతి అంశంలో జాగ్రత్త ఉండాల్సిన సమయం. అప్పులు ఇవ్వడం లేదా తీర్చడం లో అవమానపడే అవకాశం. అగౌరవం చికాకులు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పనిముట్ల తో జాగ్రత్త గాయలయ్యే అవకాశం. విద్యార్థులకు అనుకూలం. పనులల్లో జాప్యం. కొన్ని విషయాల్లో లాభదాయకం. హనుమాన్ చాలీసా పఠనం మంచి చేస్తుంది.

సింహ రాశి:

ప్రశాంత జీవనం కోసం మీరు చేసే కొన్ని విషయాలు విఫలమయ్యే అవకాశం. ఆరోగ్యం పైన దృష్టి అవసరం. తొందరపాటు చర్యలు మానుకోవడం వల్ల శుభం. కొన్ని విషయాలల్లో ఆటంకం.  కొన్ని విషయాలాలో మౌనంగా ఉండడం అవసరం.దక్షిణ మూర్తి ఆరాధన శ్రేయస్కరం.

కన్య రాశి:

అన్నిటా శుభఫలితాలు. అనుకున్న పనులు సక్రమంగా నెరవేరతాయి. కొన్ని తప్పులు స్వతహాగా చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం. మానసిక శాంతి లభిస్తుంది. సమస్యల పరిష్కారం జరుగుతుంది. సంతాన విషయంలో కొద్దిగా జాగ్రత పడాల్సిన అవసరం.  సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రెయస్కరం.

తులా రాశి:

అకాల భోజనం,ప్రతి పనిలో చికాకు.ప్రతి పని ప్రారంభంలో చాలా కష్టమనిపించినప్పటికి చివరలో విజయం మీ సొంతం. ఉద్యోగంలో జాగ్రత. పని ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ధన లాభం ఉండే అవకాశం. ఋణ వ్యవహారం లో సమస్యలు. విజ్ఞేశ్వరుడి పూజ వల్ల విజ్ఞాలు తొలగుతాయి.

వృశ్చిక రాశి:

గ్రహచారం మధ్యమ స్థాయిలో అనుకూలం .ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దీర్ఘకాలీక ప్రయాణాల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు. శుభ కార్య విషయంలో పనులు వేగంగా సాగుతాయి. ఇది ఆనందాన్నిచ్చే విషయం.ఉద్యోగంలో కానీ వ్యాపారం లోయ కానీ మీ తెలివితో సమస్య పరిష్కారం.  అంగరాక ఋణ స్తోత్ర పారాయణ మంచిది.

ధనస్సు రాశి:
ప్రతి అంశం లోనూ ఆలస్యమయ్యే అవకాశం. ఉద్యోగం విషయంలో మిశ్రమ ఫలితం. ప్రతి పనిలో ఆచి తూచి వ్యవహరించాలి. ద్వితీయార్దం లో ఉద్యోగం వ్యాపారాల్లో అనుకూలత. మధ్యవర్తిత్వం పనికిరాదు. కుటుంబ కాలహాలకు దూరంగా ఉండుట మంచిది. శనైశ్చర నరసింహ స్తోత్రం పారాయణ మంచిది.

మకర రాశి:

మిశ్రమ ఫలితాలు.పని భారం,ఆరోగ్య క్షీణత,పని ఒత్తిడి. ఉద్యోగ విషయంలో కానీ విదేశీ సంబంద విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువ. ట్రాన్సఫర్ విషయంలో సానుకూలత ఉండదు. ఆర్దిక విషయాల్లో ఆశించినంత ఫలితాలు ఉండకపోవచ్చని చెప్పవచ్చు. కాని భగవత్ అనుగ్రహం వల్ల కొన్ని పనుల్లో విజయం.వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల లాభం.

కుంభ రాశి:

ఋణ భారం పెరిగే అవకాశం. కుటుంభంలో కలహాలు అయ్యే అవకాశం. సంయనం పాటించడం అన్నీ వేళల అత్యవశరం. నిరాశకు లోనూ కావద్దు.భాగవాదారాధన వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం. అన్నీ మన మంచికే అనే భావనతో మెలిగితే కొన్నింటా విజయం మీదే. ఈ రాశి వారు విష్ణు సహాస్రనామం చేయడం వల్ల సమస్యలను అధిగమిస్తారు.

మీన రాశి:

ప్రతి పనిలో జాగ్రతగా మెలిగి విజయాన్ని పొందుతారు.ఇన్ని రోజులంనుండి ఉన్న కష్టాలు దూరమయ్యే అవకాశం. దీర్ఘ కాలిక రుణాల నుండి విముక్తి అయ్యే అవకాశం. కుటుంభంలో పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత. దినచర్య లో విశేష మార్పు. కొన్ని విషయాలో మీరు అనుకున్న వారు మీకు సహాయం చేయకపోవచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.

మరిన్ని విషయాలు వ్యక్తి గతంగా తెలుకోవాలనుకుంటే సంప్రదించండి:

కప్పకంటి అనుదీప్ శర్మ (MA Astrology) శ్రీ బాలరాజేశ్వర వాస్తు జ్యోతిష నిలయం . ph no : 9848272621.

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/anudeepsharma/public_html/wp-includes/functions.php on line 4609