Monthly Archives: June 2015

సూర్య నమస్కారం

సూర్య నమస్కారాలుసూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! ఆసనానికో ప్రయోజనం!యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ. ఈ శ్లోకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి.వీటిలో ఒకటి నుంచి ఐదు… ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం… Continue reading

శ్రీ ఆంజనేయ స్వామిని శనివారం పూజిస్తే ?

You can pray to hanuman on saturday, hanuman pooja saturday,important days for hanuman, hanuman pooja benefit saturday

శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే శనివారం శ్రేష్టమైనది.
“సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః”

అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా కాని,  కార్తీక శుద్ధ ద్వాదశినాడు కాని శనివార వ్రతం చేయాలి.

Continue reading

అధిక మాసం ఎందుకు?

భూమికి – సూర్యుడి చుట్టూ తిరగడానికి 365+ రోజుల సమయం పడుతుంది. సూర్య సిద్ధాంతపరంగా సరిగ్గా చెప్పాలంటే 365.258756 (365 రోజుల 6 గంటల 12 నిమిషాల 36+ సెకండ్లు). ఇది నాక్షత్రిక గణనము (Sidereal duration). నేటి ఆధునిక శాస్త్రీయ లెక్కలను బట్టి 365.256362 (365 రోజుల 6 గంటల 9 నిమిషాల 8+ సెకండ్లు) సమయం పడుతుంది. ఇది కూడా నాక్షత్రికమే.

సూర్య సిద్ధాంత పరంగా మరియూ నేటి ఆధునిక శాస్త్రపరంగాగానీ, రమారమిగా 29.53 రోజుల్లో చంద్రుడు భూమి చుట్టూ తిరగుతాడు (Synodic month). ఈ మాసాన్ని రెండు పక్షాలుగా; ఒక్కో పక్షం 15 తిథుల కిందా విభాగింపబడింది. ఒక్కో తిథి కనిష్టంగా 21+ గంటలనుండి గరిష్టంగా 26+ గంటల వ్యవధి కలిగి ఉండవచ్చు. ఈ లెక్కన 354+ రోజుల్లో పన్నెండు మాసాలు పూర్తి అవుతాయి.

చాంద్రమాన పద్ధతిలో అమావాస్య నుండి అమావాస్య మధ్యనున్న రోజులను గానీ పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు గల సమయాన్నిగానీ చాంద్రమాన మాసంగా పరిగణిస్తారు. చాంద్రమాన లెక్కలమీద ఆధారపడే దక్షిణ దేశస్తులు, అమావాస్యను ప్రతి మాసపు అవధిగా పరిగణిస్తే, ఉత్తర భారత దేశంలో పౌర్ణమిని లెక్కలో తీసుకుంటారు. అమావాస్యను పరిగణించే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ Continue reading

పుష్కర మహాత్యం – దాన ప్రాధాన్యతలు

గౌతమిలో పుష్కరుడు నివసించే కాలాన్ని పుష్కరాలు అని అంటారు. అందుకే పుష్కర కాలంలో చేసే స్నానాలకు, ఇచ్చే దానాలకు మంచి ఫలితముంటుందని నమ్మకం. సాధారణ రోజుల్లో సంవత్సరం పాటు గోదావరి నదీ స్నానం ఆచరిస్తే ఎంత ఫలితముంటుందో, పుష్కరాల్లో ఒక్కసారి స్నానం చేస్తే అంతే ఫలితం దక్కుతుందని చెబుతారు. వేలకొలది మనుసుతో, వాక్కుతో, శరీరంతో చేసిన వివిధ పాపాలన్నీ పుష్కర స్నానం వల్ల తొలగుతాయని విశ్వాసం. తులాపురుష దానాలు వెయ్యి చేస్తే ఏ ఫలితం దక్కుతుందో, వంద కన్యాదానాలు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో అంత ఫలితం పుష్కర స్నానం వల్ల లభిస్తుందని చెబుతారు.

అంతేగాకుండా పుష్కర కాలంలో చేసే దానాల వలన కలిగే ఫలితాలు అంతా ఇంతా కావు. దానాలలో సాలిగ్రామ దానం, శిలాదానం, కన్యాదానం, తిలపాత్రదానం, సరస్వతీ దానం..ఇవీ ఉత్తమమైన దానాలు. నదీ స్నానం చేసే ఇవి దానం చేస్తే ఫలితాలు ఉత్తమంగా ఉంటాయని కూడా చెబుతారు. అందుకే పుష్కరాల్లో ఏరోజున ఏ వస్తువులు దానం చేయాలో కూడా పేర్కొన్నారు.

పుష్కర  దానాలు రోజుల వారీగా ఇలా ఉన్నాయి..

మొదటి రోజు …

బంగారం, వెండి, ధాన్యం, భూమి. తొలిరోజు వెండిదానం చేసిన వారు చంద్రలోకానికి వెళతారని, ధాన్యం దానం చేస్తే కుబేరుడంతటి ధనవంతులవుతారని, భూమి దానం చేసిన వారికి రాజయోగం పడుతుందని చెబుతారు.

రెండవ రోజు…

Continue reading

పుష్కర నిర్ణయం – 2015

దేవగురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. గురుడు మేష రాశిలో  ప్రవేశంతో గంగానది, వృషభం -నర్మద, మిథునం- సరస్వతీ, కర్కాటకం- యమున, సింహం-గోదావరి, కన్య-కృష్ణా, తుల-కావేరి, వృశ్చికం- తామ్రపర్ణీనది, ధనుస్సు-పుష్కర వాహిని, మకరం- తుంగ భద్ర, కుంభం-సింధు, మీనం-ప్రణీతానదులకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు 12 రోజుల పాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులు నదీ స్నానాలు, దానధర్మాలు పుణ్యఫలాన్నిస్తాయి.
Continue reading